Begin typing your search above and press return to search.

గెట్ రెడీ ఫర్ విశాల్ యాక్షన్

By:  Tupaki Desk   |   13 Sep 2019 6:41 AM GMT
గెట్ రెడీ ఫర్ విశాల్ యాక్షన్
X
యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన కొలీవుడ్ హీరో విశాల్ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. రీసెంట్ గా 'టెంపర్' సినిమా రీమేక్ తో తమిళ ప్రేక్షకులను మెప్పించిన విశాల్ తాజాగా 'యాక్షన్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు తెలుగులో కూడా సేమ్ టైటిల్ ఫిక్స్ చేయడం విశేషం. యాక్షన్ చిత్రాల హీరోకు ఇంత కంటే బెస్ట్ టైటిల్ ఏముంటుంది?

ఈరోజు సాయంత్రం 5 గంటలకు 'యాక్షన్' సినిమా టీజర్ ను విడుదల చేస్తామంటూ ఫిలింమేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఒక టీజర్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో విశాల్ ఒక బైక్ పై కూర్చొని హీరోయిన్ తమన్నావైపుకు చూస్తున్నాడు. ఇక తమన్నా ఒక గ్లామరస్ డ్రెస్ లో నడుస్తూ విశాల్ ను చూస్తోంది. మంచు కొండల నేపథ్యం చూస్తుంటే ఈ సినిమాలో ఒక పాటలోని స్టిల్ లాగా అనిపిస్తోంది. ఈ పోస్టర్ లోనే సాయంత్రం 5 గంటలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.

ఈ సినిమాలో విశాల్ ఒక మిలిటరీ కమాండో పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. యోగిబాబు.. కబీర్ దుహాన్ సింగ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. హిప్ హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్ పై ఆర్. రవీంద్రన్ నిర్మిస్తున్నారు.