Begin typing your search above and press return to search.

ఆ తర్వాతే.. పెళ్లి గురించి మళ్లీ అదే మాట చెప్పిన హీరో

By:  Tupaki Desk   |   14 Nov 2022 7:30 AM GMT
ఆ తర్వాతే.. పెళ్లి గురించి మళ్లీ అదే మాట చెప్పిన హీరో
X
తమిళ హీరో విశాల్ పెళ్లి ఫిక్స్ అయ్యిందని.. పెళ్లి కూతురు ఆమె అంటూ గత కొన్నాళ్లుగా మీడియాలో ప్రచారం జరుగుతుంది. కొన్నాళ్ల క్రితమే విశాల్ వివాహం కు సంబంధించిన ప్రకటన వచ్చింది.. నిశ్చితార్థం కూడా జరిగింది. తెలుగు అమ్మాయి తో విశాల్ యొక్క వివాహం ఫిక్స్ అయ్యింది.. నిశ్చితార్థం కూడా జరిగిన తర్వాత కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్‌ అయిన విషయం తెల్సిందే.

మళ్లీ ఇన్నాళ్ల తర్వాత విశాల్ పెళ్లి గురించి మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన హడావుడి కూడా మొదలు అయ్యిందంటూ వస్తున్న వార్తలపై ఎట్టకేలకు విశాల్ స్పందించాడు.

ఆయన నటించిన లాఠీ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ హైదరాబాద్‌ లో జరిగింది. ఆ కార్యక్రమంలో విశాల్ మాట్లాడుతూ పెళ్లి పై ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశాడు.

3500 మంది నటీ నటుల మరియు రంగస్థల కళా కారుల కోసం నడిగర్‌ సంఘం యొక్క భవనం ను నిర్మిస్తున్నాం. వాళ్ల యొక్క లైఫ్ స్టైల్‌ ను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. తాను గతంలో చెప్పినట్లుగా నడిగర్ సంఘం యొక్క భవనం పూర్తి అయ్యే వరకు పెళ్లి చేసుకోను.

కళాకారుల కోసం నిర్మిస్తున్న నడిగర్ సంఘం యొక్క భవన నిర్మాణం కోసం మా టీమ్ అంతా కృషి చేస్తుందని విశాల్ అన్నాడు.

చాలా కాలంగా విశాల్‌ పెళ్లి ప్రస్థావన వచ్చిన ప్రతిసారి ఇలాగే మాట్లాడుతున్నాడు. నడిగర్ సంఘం యొక్క భవనం తో విశాల్ పెళ్లి ముడిపడి ఉంది. అది ఎప్పటికి పూర్తి అయ్యోనో... ఎప్పటికి పెళ్లి చేసుకునేనో అంటూ ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల నటి అభినయ తో విశాల్ పెళ్లి అంటూ వచ్చిన వార్తలు వైరల్‌ అయ్యాయి. ఆ వార్తలు నిజం కాదని అభినయన క్లారిటీ ఇచ్చిన విషయం తెల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.