Begin typing your search above and press return to search.
చేతిలో బీర్.. విశాల్ 'టెంపర్' లుక్
By: Tupaki Desk | 20 Nov 2018 5:04 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో గుర్తుండి పోయే ‘టెంపర్’ చిత్రం తమిళం మరియు హిందీల్లో ఒకే సారి రీమేక్ అవుతున్న విషయం తెల్సిందే. హిందీలో చిత్రీకరణ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. తమిళంలో ఈమద్యే షూటింగ్ ప్రారంభం అయ్యింది. తమిళంలో ఈ రీమేక్ లో హీరోగా విశాల్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రంకు వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. చెన్నై, వైజాగ్ సాగర తీరంలో ఈ చిత్రం షూటింగ్ జరుపుతున్నారు.
షూటింగ్ శరవేగంగా జరుపుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. మురుగదాస్ చేతుల మీదుగా విడుదలైన ‘టెంపర్’ రీమేక్ చిత్రం ‘అయోగ్య’ ఫస్ట్ లుక్ విశాల్ అభిమానులను అలరిస్తోంది. పోలీసు జీపు వద్ద చాలా స్టైల్ గా - చేతిలో బీర్ బాటిల్ తో విశాల్ కనిపిస్తున్నాడు. ఈ స్టిల్ చూస్తేనే విశాల్ పాత్ర ఏంటో తమిళ ఆడియన్స్ కు అర్థం అవుతోంది. విశాల్ ఈ చిత్రం కోసం కాస్త తగ్గినట్లుగా అనిపిస్తోంది. గత చిత్రాలతో పోల్చితే విశాల్ ఈ చిత్రంలో సన్నగా కనిపిస్తున్నాడు. విశాల్ ‘అయోగ్య’ చిత్రంలో పోసాని పోషించిన పాత్రను కేఎస్ రవికుమార్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో సన్నీలియోన్ ఐటెం సాంగ్ ఉండబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. టెంపర్ రీమేక్ తమిళనాట పెద్ద సంచలనం నమోదు చేయడం ఖాయం అంటూ విశాల్ సన్నిహితులు నమ్మకంగా చెబుతున్నారు. విశాల్ అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.