Begin typing your search above and press return to search.

ఎవరీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్?

By:  Tupaki Desk   |   22 Jan 2016 4:00 AM IST
ఎవరీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్?
X
విశాల్ చంద్రశేఖర్.. నిన్న సాయంత్రం నుంచి టాలీవుడ్ లో ఈ పేరు చర్చనీయాంశమవుతోంది. నాని కొత్త సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’కు ఇతనే మ్యూజిక్ డైరెక్టర్. నిన్న రిలీజ్ చేసిన ప్రోమో సాంగ్స్ తోనే అతడి టాలెంట్ ఏంటన్నది జనాలకు అర్థమైపోయింది. ఇక ఆడియోలోని పాటలన్నీ కూడా జనాల్ని ఇట్టే ఆకట్టుకున్నాయి. రెగ్యులర్ గా మన తెలుగు సినిమాల్లో వినిపించే ట్యూన్లేమీ ఇందులో లేవు. ‘అందాల రాక్షసి’ సినిమాతోనే మ్యూజిక్ విషయంలో డైరెక్టర్ హను రాఘవపూడి టేస్టేంటన్నది అందరికీ తెలిసింది. ఇప్పుడు ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’లోనూ హను టేస్టుకు తగ్గట్లే మంచి మ్యూజిక్ ఇచ్చాడు విశాల్. పాటలన్నీ బాగానే ఉన్నాయి కానీ.. ‘నువ్వంటే నా నవ్వు’ మెలోడీ ప్రియుల్ని కట్టిపడేస్తోంది.

తెలుగు ప్రేక్షకులకు విశాల్ నాని సినిమాతోనే పరిచయమవుతున్నాడనుకుంటే పొరబాటే. అతను ఇంతకుముందే ‘హృదయం ఎక్కడున్నది’ అనే సినిమా చేశాడు తెలుగులో. అది వచ్చింది వెళ్లింది ఎవరికీ తెలియదు. మరోవైపు తమిళంలో మాత్రం మంచి మంచి సినిమాలు చేశాడు విశాల్. సంతోష్ శివన్ తీసిన అవార్డు సినిమా ‘ఇనామ్’ తమిళంలో అతడి తొలి సినిమా. ‘టైగర్’ ఫేమ్ వీఐ ఆనంద్ రూపొందించిన ‘అప్పూచి గ్రామం’కూ అతనే సంగీతాన్నందించాడు. ఇటీవల ఆడియోతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సిద్దార్థ్ సినిమా ‘జిల్ జంగ్ జక్’కు కూడా విశాలే మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’తో తెలుగులోకి పునరాగమనం చేశాడు.