Begin typing your search above and press return to search.
విశాల్ ను సస్పెండ్ చేశారు
By: Tupaki Desk | 14 Nov 2016 5:03 PM GMTతమిళ నిర్మాతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు విశాల్ కు శిక్ష పడింది. అతణ్ని తమిళ నిర్మాతల మండలి నుంచి సస్పెండ్ చేశారు. ఐతే ఈ నిషేధం తాత్కాలికంగా తీసుకున్నదే. పైరసీ మీద నిర్మాతలు సరైన రీతిలో పోరాడటం లేదని చెబుతూ ఓ ఇంటర్వ్యూలో విశాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. నిర్మాతలు మీటింగ్ పెట్టి భజ్జీలు బోండాలు తిని.. ఆ సమావేశాల్ని ముగిస్తున్నారు తప్ప.. పైరసీ నిరోధానికి ఏ చర్యలూ తీసుకోవట్లేదని విశాల్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై నిర్మాతల మండలి మండి పడింది. వివరణ కోరుతూ అతడికి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. అయినా విశాల్ తగ్గలేదు.
తాను నిజాలే మాట్లాడానని.. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పాడు. ఐతే తాము ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వకపోవడంతో విశాల్ మీద నిషేధం విధిస్తున్నట్లు నిర్మాతల మండలి ప్రకటించింది. నిషేధం తర్వాత కూడా విశాల్ తీరు మారలేదు. బాలల దినోత్సవం శుభాకాంక్షలు చెబుతూ.. తన పోరాటం కొనసాగుతుందన్నాడు. ‘‘నిర్మాతల మండలి నన్ను సస్పెండ్ చేసినట్లు వార్త తెలిసింది. బాలల దినోత్సవ శుభాకాంక్షలు. నిర్మాతల కోసం.. ఇండస్ట్రీ కోసం నా పోరాటాన్ని కొనసాగిస్తా‘‘ అని విశాల్ పేర్కొన్నాడు. విశాల్ తన సస్పెన్షన్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం.. నిర్మాతల మండలిని ఎద్దేవా చేయడమేనని భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/