Begin typing your search above and press return to search.
మరో హీరో పొలిటికల్ ఎంట్రీ.. పోటీకి సై !
By: Tupaki Desk | 17 Dec 2020 5:01 AM GMTరాజకీయాల్లోకి మరో సినీ నటుడు రాబోతున్నాాడు. మొన్న కమల్.. నిన్న రజనీ.. తాజాగా తాను కూడా లైన్లో ఉన్నానని ప్రకటించాడు హీరో విశాల్. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నానని చెప్పిన ఈ హీరో.. వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించాడు. తమిళనాట.. తెలుగు నాట మార్కెట్ క్రియేట్ చేసుకున్న విశాల్.. హీరోగానే కాకుండా తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
పోటీకి రంగం..
విశాల్ రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నిల్లో పోటీ చేయనున్నాడు. ఇప్పటికే తన అభిమాన సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతున్న ఈ హీరో.. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడనేది చెప్పలేదు. అయితే.. విశాల్ పొలిటికల్ డ్రీమ్ ఇప్పటిదేం కాదు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆర్.కె.నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక బరిలో విశాల్ నిలిచాడు. అయితే.. అతన్ని నామినేట్ చేసిన వాళ్లలో కొంత మంది చివరి నిమిషంలో వెనక్కి తగ్గడంతో పోటీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా ఓ సాారి ఎదురు దెబ్బ తగలడంతో ఈసాారి తన పొలిటికల్ ఎంట్రీని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు.
విమర్శలు..
విశాల్ పొలిటికల్ ఎంట్రీపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. రీసెంట్‌గా జరిగిన నిర్మాతల మండలి సమావేశంలో విశాల్ తాము అడిగిన ప్రశ్నలకు విశాల్ సమాధానం ఇవ్వలేదని అంటున్నారు. నడిగర్ సంఘంలో దాదాపు ఏడెనిమిది కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశాడని కూడా విశాల్‌పై ఆరోపణలున్నాయి. విశాల్ రాజకీయాాల్లో పోటీ చేయాలనుకుంటే.. సినీ రంగంలో తన పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, ఈ విమర్శలకు విశాల్ ఏం చెబుతారనేది చూడాలి.