Begin typing your search above and press return to search.

వాళ్లే వద్దు అని కోరుకున్నారు

By:  Tupaki Desk   |   29 Dec 2017 9:53 AM GMT
వాళ్లే వద్దు అని కోరుకున్నారు
X
పేరుకి తెలుగువాడే కానీ విశాల్ కోలీవుడ్ లో సీనియర్లను ఓవర్ టేక్ చేసి మరీ తన స్థానాన్ని అక్కడ సుస్థిర పరుచుకున్నాడు. నడిగర్ సంఘం - నిర్మాతల మండలి వ్యవహారాలు ఏకతాటిపై నడిపిస్తూ యమా జోరు మీదున్న విశాల్ మొన్న ఆర్కే నగర్ ఉపఎన్నిక కోసం వేసిన నామినేషన్ రిజెక్ట్ అయ్యింది కానీ లేదంటే సీన్ ఇంకోలా ఉండేది. దాని గురించి మరోసారి ప్రస్తావించాడు విశాల్. తన కొత్త సినిమా ఇరంబుతీరై(తెలుగులో 'అభిమన్యుడు')టీజర్ లాంచ్ లో పాల్గొన్న విశాల్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆర్కే నగర్ బరిలో నిలవకూడదు అని చాలా మంది కోరుకున్నారని, ఎలక్షన్ కమిషన్ తిరస్కరించింది అని తెలియగానే సంబరాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారని బాంబు పేల్చాడు. అందులో ఈ సినిమా దర్శకుడు మిత్రన్ కూడా ఉన్నారని చెప్పడం ఇక్కడ అసలు ట్విస్ట్.

మిత్రన్ కోరుకుంది మంచి ఉద్దేశ్యంతో లేండి. ఒకవేళ విశాల్ కనక బరిలో నిలబడితే సినిమా విడుదల ఆలస్యం అవుతుందని, అందుకే నేను ఉండకూడదు అని కోరుకున్నారు కాబట్టే దేవుడు మనవి ఆలకించి ఉంటాడని చెప్పి విశాల్ నవ్వులు పూయించాడు. సమంతా సైకాలజీ డాక్టర్ గా నటిస్తున్న ఈ మూవీలో విశాల్ గురువుగా భావించే యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో కనిపిస్తారు. జనవరి 26 రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు కానీ అదే సమయంలో తెలుగులో విపరీతమైన పోటీ ఉంది. మరి విశాల్ డోంట్ కేర్ అని బరిలో దూకుతాడేమో చూడాలి. నల్లనయ్య విశాల్ తో సమంతా మొదటిసారి జోడి కట్టింది. సైబర్ క్రైమ్ నేపథ్యంలో రూపొందిన ఈ కాన్సెప్ట్ ఇప్పటిదాకా వచ్చిన థ్రిల్లర్ మూవీస్ లో ప్రత్యేకంగా నిలుస్తుంది అని విశాల్ అంటున్నాడు.