Begin typing your search above and press return to search.
నా డబ్బుతో శిల్పాశెట్టి దంపతులు అశ్లీల వీడియోలు తీశారు
By: Tupaki Desk | 4 Sep 2021 2:30 AM GMTబాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై మరో కేసు నమోదైంది. వ్యాపారంలో పెట్టుబడి పెడుతానని చెప్పి తన దగ్గర రూ.41 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త విశాల్ గోయల్ తాజాగా పోలీసులను ఆశ్రయించాడు. ఈ డబ్బును అశ్లీల సినిమాలు తీసేందుకు ఉపయోగించారని ఆరోపించారు.
స్వలాభం కోసం చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారని తన ఫిర్యాదులో విశాల్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలా చాలామంది దగ్గర డబ్బు తీసుకొని వాటి ద్వారా అశ్లీల వీడియోలు తీశారని తీవ్ర ఆరోపణలు చేశాడు. దీనిపై ఢిల్లీ పోలీసులు ఇదివరకే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇందులో శిల్పాశెట్టి దంపతులతోపాటు నందన మిశ్రా, దర్శిత్ షా, ఎంకే మధ్వా, సత్యేంద్ర సరుప్రియ, ఉమేశ్ గోయంక పేర్లున్నాయి. అయితే రోజులు గడుస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సదురు వ్యాపారవేత్త ఢిల్లీ కోర్టును ఆశ్రయించాడు.
ఈ సందర్భంగా మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ మన్ని మాలిక్ పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించాడు. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 9కు వాయిదా వేశారు.