Begin typing your search above and press return to search.

‘పందెం కోడి’ విశాల్ తో నాటు కోడి ఫైటింగ్

By:  Tupaki Desk   |   16 July 2018 5:05 AM GMT
‘పందెం కోడి’ విశాల్ తో నాటు కోడి ఫైటింగ్
X
నాటు కోడి.. ‘పందెం కోడి’.. సై అంటే సై అన్నాయి.. చుసుకుందాం రా అని ఫోజిచ్చాయి. కానీ ‘పందెంకోడి’ ఎవరనుకుంటున్నారు.. ఆ టైటిల్ మీద సినిమా తీసి హిట్ కొట్టిన హీరో విశాల్. ఆయన తాజాగా పందెంకోడి2 సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ సెట్ లోకి ఓ నాటు కోడి రావడంతో దానితో విశాల్ పోటీపడ్డారు. ఆ సరదా సన్నివేశం ఫొటోలు బయటకు రావడంతో వైరల్ గా మారింది.

సృజనాత్మతకు తావు లేవు.. ఎక్కడ ఏ టైమింగ్ దొరికినా దాన్ని మనకు అనుకూలంగా మలుచుకున్నప్పుడే మన టాలెంట్ బయటపడేది.. ఇప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కీర్తి సురేష్ పోస్టు చేసిన ఫొటో అందరినీ ఆకర్షిస్తోంది. ‘మహానటి’తో తన టాలెంట్ ను నిరూపించుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు తన కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. తమిళ్ లో లింగుస్వామి దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న ‘సండై కోళి-2’లో కీర్తి హీరోయిన్. తెలుగులో విజయం సాధించిన ‘పందెం కోడి’ మూవీకి ఇది సీక్వెల్. భారీ అంచనాలతో రెండో పార్ట్ ను సిద్ధం చేస్తున్నారు..

షూటింగ్ స్పాట్ లో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ‘పందెంకోడి2’ మూవీ సెట్ లోకి నిజంగా ఓ కోడిపుంజు వచ్చేసింది. అక్కడి జిప్సీ మీద ఠీవీగా నిలబడింది. చుట్టూ వందల మంది ఉన్నా ఆ కోడి వణకలేదు.. బెదరలేదు.. దాన్ని ఫొటోలు తీసుకోవడానికి సెట్ లో చాలా మంది ఆసక్తి చూపించారు. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా క్లిక్ మనిపించారు. అప్పుడే హీరో విశాల్ కోడితో ‘సై’ అన్నట్టు ఫోజిచ్చాడు. ఆ నాటు కోడి.. ఈ ‘పందెంకోడి’ ల రెండు ఫొటోలను తీసిన కీర్తి సురేష్ వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చారు.. ఈ ఫొటో చూస్తుంటే.. జిప్సీ పైన నాటుకోడి.. కింద నిజమైన ‘పందెంకోడి’ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.