Begin typing your search above and press return to search.
`టెంపర్` చూపించేది విశాల్
By: Tupaki Desk | 18 March 2016 7:04 AM GMTతమిళ్‌లో `టెంపర్` చూపించే హీరో ఎవరన్న విషయం గురించి కొన్ని రోజులుగా పెద్ద చర్చ సాగుతోంది. మొదట శింబుతో ఆ సినిమాని రీమేక్ చేస్తారని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు విశాల్ తెరపైకొచ్చాడు. విశాల్ దాదాపుగా ఖాయమైనట్టే అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రాబోతోందట. పోలీసాఫీసర్ పాత్రలో ఎన్టీఆర్ తెలుగులో చూపించిన `టెంపర్` అదిరిపోయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. నెగెటివ్ షేడ్స్ లో ఉన్న పోలీసు పాత్రలో ఎన్టీఆర్ జీవించాడు. ముఖ్యంగా ఆ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతం అనిపించాయి. ఎన్టీఆర్ నటుడిగా వందకి వంద మార్కులు తెచ్చుకున్నాడు. ఆ సినిమా గురించి తెలుసుకున్న ఇతర చిత్ర పరిశ్రమలు రీమేక్ రైట్స్ కోసం ఎగబడ్డాయి. తాజాగా తమిళంలో ఓ నిర్మాత టెంపర్ రీమేక్ రైట్స్ చేజిక్కించుకున్నాడు.
ఆ సినిమాని అక్కడ శింబుతో తీయాలని డిసైడైయ్యారు. శింబు కూడా అందుకు ఒప్పుకున్నాడని ప్రచారం సాగింది కానీ ఏమైందో తెలియదు... ఇంతలోనే విశాల్ పేరు తెరపైకొచ్చింది. అయితే ఈ సినిమాని విశాల్ కాకుండా శింబు చేసుంటేనే బాగుండేదని తెలుగు సినిమా వర్గాలు చెబుతున్నాయి. విశాల్ ఇదివరకు చేసిన జయసూర్య సినిమా తరహాలోనే టెంపర్ ఉంటుందని, అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీసుగానే కనిపించిన విశాల్ మళ్లీ టెంపర్ లో కూడా అదే తరహాలో కనిపించాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ విశాల్ మాత్రం ఆ సినిమాకీ, ఈ సినిమాకీ పెద్దగా పోలీకలేమీ లేవనీ, ఈ సినిమాని నేను చేయొచ్చని డిసైడైయ్యాడట.