Begin typing your search above and press return to search.
దీపావళికి ఓటీటీలో విశాల్ లేటెస్ట్ మూవీ...?
By: Tupaki Desk | 17 Sep 2020 2:00 PM GMTకోలీవుడ్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ ''చక్ర''. ఎమ్.ఎస్ ఆనందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విశాల్ హోమ్ బ్యానర్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పై నిర్మించారు. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ - రెజీనా కసాండ్ర - శృతి డాంగే హీరోయిన్స్ గా నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. సైబర్ క్రైమ్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. తెలుగు - తమిళ - మలయాళ - కన్నడ నాలుగు దక్షిణాది భాషల్లో రూపొందించబడుతున్న ''చక్ర'' మూవీ.. విశాల్ గత చిత్రం 'అభిమన్యుడు' తరహాలోనే అత్యుత్తమ సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి.
కాగా, కరోనా కారణంగా థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో మేకర్స్ తమ సినిమాలను ఓటీటీలలో రిలీజ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విశాల్ 'చక్ర' కూడా ఓటీటీలో రిలీజ్ కానుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో దీపావళి కానుకగా ఈ సినిమా విడుడల అవుతుందని సమాచారం. ఈ విషయాన్ని విశాల్ కంఫర్మ్ చేసారని పలు వెబ్ మీడియా ఛానల్స్ చెప్పుకొచ్చాయి. 'చక్ర' 7 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని.. 35 మంది టీమ్ తో చెన్నైలో మిగతా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నామని విశాల్ వెల్లడించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా థియేటర్స్ ఇప్పుడప్పుడే రీ ఓపెన్ చేస్తారని అనుకోవడం లేదని.. ప్రస్తుత పరిస్థితుల్లో సినీ ఇండస్ట్రీ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారానే సర్వైవ్ కాగలదని.. అందుకే 'చక్ర' ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని విశాల్ చెప్పినట్లు సదరు వెబ్ మీడియా ఛానల్ పేర్కొంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.