Begin typing your search above and press return to search.
పైరసీ వెబ్ సైట్ కు విశాల్ వార్నింగ్
By: Tupaki Desk | 4 April 2017 4:15 AM GMTనడిగర్ సంఘం ఎన్నికల్లో గెలవగానే తన పనితనం చూపిస్తూ సంఘం రూపు రేఖల్నే మార్చేసిన తమిళ హీరో విశాల్.. ఇప్పుడు నిర్మాతల మండలి ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత కూడా గట్టి కార్యాచరణతోనే ముందుకెళ్లేలా ఉన్నాడు. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం విశాల్ మాట్లాడుతూ.. ముందుగా ఢిల్లీ స్థాయిలో పోరాడుతున్న తమిళనాడు రైతులకు అండగా నిలవడమే తన ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పాడు. ఆపై నిర్మాతల మండలిని చక్కదిద్దే పని మీద దృష్టిసారిస్తానని చెబుతూ.. పైరసీ మీద పోరాటం గట్టిగా ఉండబోతుందని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా పైరసీ సినిమాలకు పెట్టింది పేరైన తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ పేరు పెట్టి మరీ విశాల్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ వెబ్ సైట్ల సంగతేంటో తేలుస్తానని విశాల్ అన్నాడు.
తమిళ సినిమాల విషయంలో పైరసీ సైట్ల బరితెగింపు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య సూర్య సినిమా ఎస్-3 రిలీజవుతుంటే.. రిలీజ్ రోజు ఉదయం 11 గంటల నుంచి తమ వెబ్ సైట్లో సినిమాను లైవ్ చేస్తామని ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించి షాకిచ్చింది తమిళ్ రాకర్స్ అనే వెబ్ సైట్. అసలు విశాల్ నిర్మాతల మండలి ఎన్నికల రేసులోకి వచ్చిందే పైరసీ అంశం మీద మాట్లాడే. నిర్మాతల మండలి సభ్యులు సమావేశాలు పెట్టి భజ్జీలు.. బోండాలు తినడం తప్ప పైరసీని ఆపడానికే ఏం చేసింది లేదంటూ గత ఏడాది అతను చేసిన విమర్శలు సంచలనం రేపాయి. ఆ తర్వాతే నిర్మాతల మండలితో గొడవ ముదిరి.. ఎన్నికల బరిలో నిలిచాడు విశాల్. గతంలో అతను నేరుగా పైరసీ సీడీ షాపుల మీద దాడి కూడా చేశాడు. ఇప్పుడు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ పైరసీ మీద ఎలా పోరాడతాడో చూడాలి మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/