Begin typing your search above and press return to search.
నల్లనయ్యా నీకు థియేటర్లెక్కడయ్యా?
By: Tupaki Desk | 6 Jan 2016 6:18 AM GMTఈ సంక్రాంతిని నాలుగు సినిమాలు కమ్మేశాయి. ఒకదాని వెంట ఒకటిగా రిలీజై పండగ వాతావరణం తెస్తున్నాయి. సెలవుల వేళ థియేటర్లన్నీ కిటకిటలాడిపోవడం ఖాయం అన్న లెక్కలేసుకుని మరీ రిలీజ్ చేస్తున్నారు. బాలకృష్ణ - నాగార్జున - ఎన్టీఆర్ - శర్వానంద్ లాంటి స్టార్లు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. 13, 14, 15 తేదీల్లో మూడు క్రేజీ సినిమాలు రిలీజైపోతున్నాయి. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో - బాలకృష్ణ డిక్టేటర్ - నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా - శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా ఎంతో క్రేజీగా రిలీజవుతున్నాయి.
అయితే ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న షుమారు 1500 స్ర్కీన్లను ఈ సినిమాలన్నీ పంచేసుకుంటున్నాయి. ఇలాంటి ఠఫ్ కాంపిటీషన్ లో తమిళ తంబీ విశాల్ రేసులోకి రావడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందరు బరిలో ఉన్నా నే వచ్చేస్తున్నా అంటూ ప్రకటించాడు నల్లనయ్య. ఈ సంక్రాంతికి తన క్రేజీ ప్రాజెక్టును తెలుగులో రిలీజ్ చేయాలన్నది విశాల్ ప్లాన్. కథకళి జనవరి విడుదల అంటూ పోస్టర్ కూడా వేసేశాడు. అయితే అతడికి థియేటర్లు ఇచ్చే నాథుడెవరు? ఇప్పుడున్న నాలుగు సినిమాలకే థియేటర్లు చాలని పరిస్థితి. ఇలాంటప్పుడు విశాల్ కి కనీసం 100 థియేటర్లయినా దొరకడం గగనమే. కనీసం 50 దక్కించుకున్నా గ్రేట్ అనే అంటున్నారు.
అయితే మన స్టార్లను ఢీకొట్టేంత ధైర్యం విశాల్ కి ఎక్కడినుంచి వచ్చిందో కానీ అతడి గట్స్ ని మెచ్చుకోవాలి. కథకళి చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించారు. క్యాథరిన్ కథానాయికగా నటించింది. ఒకవేళ కథకళిలో వైవిధ్యం ఉంటే, ఈ స్టార్ హీరోల సినిమాల్ని కొట్టేంత దమ్ముంటే ఎప్పుడొచ్చినా గెలుపు నీదే.