Begin typing your search above and press return to search.
ఆ సినిమాకు ఇన్నాళ్లకు మోక్షం వచ్చింది
By: Tupaki Desk | 15 Feb 2016 3:30 PM GMTతమిళ సినీ పరిశ్రమలో తెలుగు జెండా ఎగరేసిన కుర్రాడు విశాల్. ‘ప్రేమ చదరంగం’ లాంటి చిన్నసినిమాతో హీరోగా పరిచయమై.. ఆ తర్వాత ‘పందెం కోడి’ లాంటి మాస్ సినిమాతో స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్. మధ్యలో కెరీర్ కొంచెం గాడి తప్పినా.. ఈ మధ్య వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు నల్లనయ్య. వరుసగా అతను అరడజను హిట్లు కొట్టడం విశేషం. ఈ మధ్యే నడిగర్ సంఘం కార్యదర్శిగా కూడా ఎన్నికై తన ఇమేజ్ మరింత పెంచుకున్న విశాల్.. ఈ వేడిలో చాన్నాళ్లుగా విడుదలకు నోచుకోకుండా మూలన పడి ఉన్న ఓ సినిమాను బయటికి తీయబోతున్నాడు.
దాదాపు నాలుగేళ్ల కిందట విశాల్.. సుందర్ దర్శకత్వంలో ‘మదగజ రాజా’ అనే సినిమా చేశాడు. ఈ పేరును షార్ట్ చేస్తే ‘ఎంజీఆర్’ అని వస్తుంది. ఆ పేరుతోనే ప్రమోషన్లు అవీ చేయడంతో వివాదం నెలకొంది. అన్నాడీఎంకే కార్యకర్తలు దీనిపై పెద్ద గొడవ చేశారు. ఆ గొడవ బాగా ముదిరి సినిమా విడుదలే కాకుండా ఆగిపోయింది. ఆ తర్వాత ఎన్నోసార్లు ఈ చిత్రాన్ని బయటికి తేవడానికి ప్రయత్నాలు చేశాడు విశాల్. కానీ కుదర్లేదు. ఇక ఎప్పటికీ ఈ సినిమా థియేటర్ల ముఖం చూడదేమో అనుకుంటుంటే.. ఉన్నట్లుండి ఇప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చాడు విశాల్. మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశాడు. విశాల్ కు, శరత్ కుమార్ తనయురాలు వరలక్ష్మికి ఎఫైర్ మొదలవడానికి ఈ సినిమానే కారణం. ఇందులో వరలక్ష్మితో పాటు అంజలి హీరోయిన్ గా నటించింది. దీన్ని తెలుగులో ‘ఎన్టీఆర్’ పేరుతో డబ్బింగ్ కూడా చేశారు. పనిలో పనిగా దాన్ని కూడా రిలీజ్ చేసేస్తారేమో.