Begin typing your search above and press return to search.
విశాల్ కమిట్ మెంట్ సూపర్ కదా
By: Tupaki Desk | 19 Feb 2016 6:08 AM GMTఏడాదిన్నర క్రితం స్వచ్ఛ్ భారత్ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ కేంపెయిన్ ప్రారంభించినపుడు చాలా మంది ముందుకొచ్చారు. చీపుళ్లు పట్టుకుని రోడ్లు - కాలువలు ఊడ్చేస్తున్నట్లుగా ఫోటోలకు భలే పోజిలిచ్చారు. అఫ్ కోర్స్.. కొంతమంది ఆ కాసేపైనా నిజంగానే ఊడ్చారు. ఆ తర్వాత మాత్రం దాదాపు అందరూ ఈ విషయాన్ని మర్చిపోయారు. కానీ విశాల్ మాత్రం ఇంకా తన స్వచ్ఛ్ భారత్ ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. అది కూడా ఆ కార్యక్రమాన్ని మరింతగా ఇంప్రూవ్ చేసి, తన సొంత ఐడియాలజీని కూడా అప్లై చేస్తున్నాడు.
కోలీవుడ్ మూవీ మరుదు షూటింగ్ సమయంలో.. తమిళనాడులో విరుద్ నగర్ జిల్లా ప్రజలు ఎదుర్కుంటున్న కష్టాలను స్వయంగా చూశాడు విశాల్. ముఖ్యంగా ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో మహిళలు తెల్లవారుజామునే కాలకృత్యాలకు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి చూసి కదిలి పోయాడట. అందుకే ఆ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్తలు, డాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లతో కలిసి ఓ గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాడు విశాల్.
ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి 20వేలు ఖర్చవుతుంది. అందులో గవర్నమెంట్ 8వేలు సబ్సిడీ ఇస్తుంది. మరో 12వేలు అవసరం. ఒక్కో వ్యక్తి ముందుకొచ్చి కనీసం ఒక మరుగుదొడ్డి నిర్మాణానికి సాయం అందిచాల్సిందిగా కోరుతున్నాడు విశాల్. వ్యక్తిగతంగాను, సామాజికంగాను ఉపయోగపడేలా.. కనీసం వెయ్యి మరుగుదొడ్లు నిర్మించాలన్నది విశాల్ టార్గెట్. మాటలు చెప్పడంతో సరిపెట్టకుండా.. అది ఆచరణలో కూడా చూపిస్తున్న విశాల్ కమిట్మెంట్ ని సూపర్ అనాల్సిందే.