Begin typing your search above and press return to search.
విశాల్ మళ్లీ హీరో అయిపోయాడుగా..
By: Tupaki Desk | 3 Feb 2017 4:27 AM GMTతమిళనాట విశాల్ తెరమీదే కాదు.. బయట కూడా హీరోనే. పైరసీ మీద పోరాటం విషయంలో కావచ్చు.. నడిగర్ సంఘంలో అన్యాయాల గురించి ప్రశ్నించి.. ఆపై ఎన్నికల్లో గెలవడం ద్వారా కావచ్చు.. తన సేవా కార్యక్రమాల ద్వారా కావచ్చు.. అనేక రకాలుగా హీరో అయ్యాడు విశాల్. సినీ రంగంలో ఎక్కడే అన్యాయం జరిగినా.. ఎవరికీ భయపడకుండా తన వాయిస్ వినిపిస్తుంటాడు విశాల్. ఆ మధ్య తమిళ నిర్మాతలు పైరసీ మీద మొక్కుబడిగా చర్యలు తీసుకుంటున్న తీరు మీద మండి పడుతూ.. విశాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ వ్యాఖ్యల విషయంలో విశాల్ కు షోకాజ్ నోటీసులు ఇవ్వడమే కాదు.. మూడు నెలలు సస్పెన్షన్ వేటు కూడా వేసింది నిర్మాతల మండలి.
దీంతో విశాల్ కోర్టుకెక్కాడు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన న్యాయస్థానం.. నిర్మాతల మండలికి ఝలక్ ఇచ్చింది. విశాల్ మీద సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలని నిర్మాతల మండలికి సూచిస్తూ.. విచారణను వాయిదా వేసింది. తాను 2003 నుంచి తమిళ నిర్మాతల మండలిలో సభ్యుడిగా ఉంటున్నానని.. గతేడాది జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీచేసి ప్రధాన కార్యదర్శిగా గెలుపొందానని తన పిటిషన్లో విశాల్ పేర్కొన్నాడు. నడిగర్ సంఘం ఎన్నికల్లో రాధారవికి మద్దతుగా నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న ఎస్.థాను వ్యవహరించారని.. అందువల్లే నిర్మాతల మండలి ఎన్నికల్లో తాను పోటీ చేస్తానన్న భయంతో మండలి నుంచి తనను 3 నెలలు సస్పెండ్ చేశారని పేర్కొన్నాడు. తాను నిర్మాతల మండలిపై తీవ్ర వ్యాఖ్యలేమీ చేయలేదని.. తనకిచ్చిన షోకాజ్ నోటీసుకు కూడా స్పందించానని.. ఐతే తన వివరణను పట్టించుకోకుండా సస్పెన్షన్ వేటు వేశారని విశాల్ పేర్కొన్నాడు. కేసు ప్రాథమిక విచారణ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తూ విశాల్ మీద సస్పెన్షన్ తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే.. తమిళనాట విశాల్ మరోసారి హీరో అయిపోవడం ఖాయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/