Begin typing your search above and press return to search.
సెన్సేషనల్ డైరెక్టర్ తో విశాల్
By: Tupaki Desk | 11 March 2016 7:30 AM GMTకెరీర్ ఆరంభంలో వరుసగా మాస్ సినిమాలు చేసి అటు తమిళంతో పాటు తెలుగులోనూ మాస్ హీరోగా మంచి పేరు సంపాదించాడు విశాల్. ఐతే ఒక దశలో మరీ రొడ్డకొట్టుడు మాస్ సినిమాలు చేయడంతో జనాలకు మొనాటనీ వచ్చేసింది. తెలుగు ప్రేక్షకులు అతణ్ని పక్కనబెట్టేశారు. తమిళంలో కూడా కెరీర్ బాగా దెబ్బ తిన్న టైంలో సొంతంగా ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’ అనే ప్రొడక్షన్ హౌజ్ మొదలుపెట్టి వైవిధ్యమైన సినిమాలతో ప్రయాణం సాగించాడు విశాల్. అవన్ ఇవన్ (వాడు వీడు), పాండియనాడు (పల్నాడు), నాన్ సిగప్పు మనిదన్ (ఇంద్రుడు), పాయుం పులి (జయసూర్య) లాంటి డిఫరెంట్ సినిమాలు అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. లేటెస్టుగా సంక్రాంతికి రిలీజైన ‘కథకళి’ కూడా బాగానే ఆడింది.
ఇప్పుడు విశాల్ మరో వైవిధ్యమైన సినిమాకు రెడీ అవుతున్నాడు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వంలో అతనో సినిమా చేయబోతున్నాడు. ‘తుప్పారివాలన్’ పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు కూడా విశాలే నిర్మాత. మిస్కిన్ గురించి చెప్పడానికి చాలా ఉంది. అతడికి తెలుగు సినిమాలతో కూడా కనెక్షన్ ఉంది. ‘రాజు భాయ్’ పేరుతో తెలుగులోకి రీమేక్ అయిన ‘మౌనం పేసియదె’తో దర్శకుడిగా పరిచయమయ్యాడు మిస్కిన్. దీని తర్వాత అతను తీసిన సినిమాలన్నీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. జీవా హీరోగా తెలుగులోకి వచ్చిన ‘మాస్క్’ కూడా అతడి సినిమానే. లేటెస్టుగా ‘పిశాచి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు మిస్కిన్. ఒక డిఫరెంట్ స్టయిల్ తో సినిమాలు తీసే మిస్కిన్ తో విశాల్ జట్టు కడుతుండటంతో ఈ సినిమాపై కోలీవుడ్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తెలుగులోకి కూడా అనువాదం కాబోతోంది.