Begin typing your search above and press return to search.
ఆ కల నెరవేర్చుకుంటానంటున్న విశాల్
By: Tupaki Desk | 4 Nov 2018 10:53 AM GMTఅప్పుడప్పుడూ నటులు దర్శకులవుతుంటారు.. దర్శకులు నటులుగా మారుతుంటారు. దర్శకుడు కావడమే లక్ష్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతమంది అనుకోకుండా నటనలోకి వచ్చి.. ఆ తర్వాత దర్శకులుగా మారే ప్రయత్నమూ చేస్తుంటారు. తెలుగులో అల్లరి నరేష్.. నాని.. రాజ్ తరుణ్.. సప్తగిరి.. ఇలా చాలామంది ముందు పని చేసింది దర్శకత్వ శాఖలోనే. తర్వాత అనుకోకుండా వాళ్లు నటులయ్యారు. తమిళంలో విశాల్ కూడా ఇదే బాటలో నడిచాడు. అతను సీనియర్ నటుడు.. దర్శకుడు అర్జున్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశాడు. తర్వాత నటనలోకి ప్రవేశించాడు. హీరోగా పెద్ద రేంజికి వెళ్లాడు. హీరోగా వరుస హిట్లతో దూసుకెళ్తున్న విశాల్.. త్వరలోనే దర్శకత్వం చేపడతాడట. వచ్చే ఏడాదో.. ఆ తర్వాతి ఏడాదో.. ఎప్పుడో ఒకప్పుడు తాను దర్శకుడిగా మారడం ఖాయం అని చెప్పాడు విశాల్.
ప్రస్తుతం ‘టెంపర్’ రీమేక్‌లో నటిస్తున్న విశాల్.. దీని తర్వాత ఇంకో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ‘అభిమన్యుడు’ తరహాలోనే సామాజిక అంశాలతో ఒక కథ రెడీ అవుతోందన్న విశాల్.. దాని తర్వాత ‘పందెంకోడి-3’ చేసే అవకాశాలున్నట్లు చెప్పాడు. వీటితో పాటు తాను దర్శకుడిగా పరిచయం అయ్యే సినిమా కోసం కథ రెడీ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పాడు. తనకు రామ్ గోపాల్ వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేయాలని చాలా కోరిక ఉండేదని.. ఐతే ఇంట్లో ఆ విషయం చెబితే తాను ముంబయికి వెళ్లి మళ్లీ ఇంటికి రానేమో అని భయపడి అర్జున్ దగ్గర అసిస్టెంటుగా చేర్చినట్లు విశాల్ తెలిపాడు. నిజానికి తన అన్నయ్య నటనలోకి రావాలని.. తాను దర్శకత్వం చేపట్టాలని అనుకున్నామని.. కానీ అనుకోకుండా తాను నటుడిగా మారి.. తన అన్నయ్య నిర్మాణంలోకి వెళ్లిపోయాడని విశాల్ తెలిపాడు.