Begin typing your search above and press return to search.
హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటే తప్పేంటి?
By: Tupaki Desk | 10 Nov 2015 4:59 AM GMTనల్లనయ్య విశాల్ ఓ రియల్ ఛాలెంజర్. రీల్ లైఫ్ లోనూ - రియల్ లైప్ లోనూ అతడు సిసలైన హీరో అని నిరూపించుకున్నాడు. ప్రతి దీపావళి పండక్కి తను నటించిన ఓ సినిమా రిలీజ్ కి వచ్చేది. హిట్ కొట్టేది. అయితే ఈసారి ఆ ఛాన్సే లేదు. ఈ దీపావళి పండక్కి విశాల్ నటించిన సినిమా ఏదీ రిలీజ్ కి రావడం లేదు. అందుకే అతడు రేసు నుంచి దూరంగా ఉన్నాడు.
అయితే అతడి జీవితంలోకి దీపావళి వేరే కోణంలో వెలుగులు నింపింది. ఇటీవలి కాలంలో తమిళ ఆర్టిస్టుల సంఘం (నడిగర సంఘం) ఎన్నికల్లో అతడు ప్రత్యర్థి పై నెగ్గి జనరల్ సెక్రటరీగా ఎంపికయ్యాడు. నటుడు - నిర్మాత శరత్ కుమార్ తో హోరాహోరీలో ఈ గెలుపు సాధ్యమైంది. అందుకే విశాల్ మీసం మెలేస్తూ హుషారుగా ఉన్నాడు. నడిగర సంఘం ఎన్నికలు రియల్ గానే విశాల్ - శరత్ కుమార్ మధ్య పోటీ అచ్చం సినిమా చూపిస్త మావ సినిమాలానే కనిపించింది. పోటీలో నెగ్గాడు కాబట్టి ఆ ఆనందోత్సాహం విశాల్ లో కనిపిస్తోందని అంటున్నారు.
మరి ఇదే ఉత్సాహంలో బ్యాచిలర్ షిప్ వదిలేసి, తాను వలచిన అమ్మాయిని పెళ్లాడేయొచ్చు కదా? ఇదే విషయం అడిగితే.. విశాల్ చక్కని సమాధానం చెప్పాడు. నడిగర సంఘంకి ముందు ఓ బిల్డింగ్ నిర్మించాలి. ఆ బాధ్యత నెరవేరాక, వెంటనే పెళ్లి వేడుక కూడా ఉంటుంది.. అంటూ సెలవిచ్చాడు. ఇన్నేళ్ల కెరీర్ లో హైదరాబాద్ ఫిలిం జర్నలిస్టులు ఎన్ని సార్లు ఈ సంగతిని ప్రశ్నించినా బైటపడని విశాల్ ఇన్నాళ్టికి పెళ్లి మూడ్ లోకి వచ్చాడు. అసలింతకీ తాను వలచిన మామ (శరత్ కుమార్) కూతురు వరలక్ష్మినే పెళ్లాడుతున్నాడా? ఏమో! హీరోయిన్ నే పెళ్లాడతావా గురూ? అని ప్రశ్నిస్తే ... ఏం.. హీరోయిన్ ని పెళ్లాడితే తప్పేంటి? అని తిరిగి కౌంటర్ వేశాడు. అంటే దీనర్థం ఏమిటో? మరి కొన్నాళ్లు ఆగితే కానీ తెలీదు. విశాల్ హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కథాకళి సంక్రాంతికి రిలీజ్ కానుంది.