Begin typing your search above and press return to search.

ఫ్లాపు సినిమాలకే నాలుగు పెడుతున్నారు...

By:  Tupaki Desk   |   3 Jun 2016 5:30 PM GMT
ఫ్లాపు సినిమాలకే నాలుగు పెడుతున్నారు...
X

ఈ మధ్య కాలంలో మన తెలుగు మీడియా ముందుకు ఓ నాలుగైదుసార్లు వచ్చింది తెలుగమ్మాయ్ శ్రీదివ్య. ఆమె తమిళ సినిమా డబ్బింగ్‌ వర్షెన్‌ అయిన ''రాయుడు'' సినిమాను ప్రమోట్‌ చేసుకోవడానికి అమ్మడు ఇన్నేసి ఎప్పీరియన్సులు ఇచ్చింది. మరీ టూ మచ్ అని ఎవరైనా అంటుంటే మాత్రం.. వాళ్ళకు హీరో విశాల్‌ ఏం చెబుతున్నాడో ఓసారి తెలియాలి.

ఫ్లాపైన సినిమాకే.. సక్సెస్ మీట్లు అవీ ఇవీ అంటూ నాలుగు ప్రెస్‌ మీట్లు పెడుతన్నాం.. అలాంటప్పుడు బాక్సాఫీస్‌ దగ్గర కలక్షన్లు బాగా వస్తున్న సినిమాకు అసలు ఇంకెన్ని పెట్టాలో చెప్పండి అంటూ ప్రశ్నించాడు విశాల్‌. పైగా రెండో వారంలోకి వచ్చాక కూడా సినిమా ఇంకా దూసుకుపోవడంతో.. ఎట్లాగైనా బాగా ప్రమోట్‌ చేసి ఇంకొంచెం ఎక్కువ కాసులు వెనకేసుకుందాం అని ప్లాన్‌ వేశాడట. అందుకే ఇప్పుడు ఒక రోజు విశాల్‌ ఒక రోజు శ్రీదివ్య ఇలా ప్రమోషన్లతో హోరెత్తిస్తున్నారు.

బాగుందండీ. సర్దార్‌ అండ్‌ బ్రహ్మోత్సవం వంటి సినిమాలను కూడా రిలీజయ్యాక ఏదో నాలుగు మాటలు చెప్పించుంటే బాగుండేది. ప్రమోషన్లు లేకనే అలా చతికిలపడిపోయాయ్‌. ఇక పాజిటివ్‌ టాక్‌ తో రన్‌ అవుతున్న అ..ఆ వారు పోస్ట్-రిలీజ్‌ ప్రమోషన్లు ఎప్పుడు మొదలెడతారో!!