Begin typing your search above and press return to search.
విశాల హృదయంతో ఒక్క రూపాయి
By: Tupaki Desk | 14 Sep 2017 8:18 AM GMTతెరపై కనిపించగానే మనవాడు వచ్చేసాడు అని అభిమానుల నుంచి అనిపించుకోవాలంటే హీరోలు ఎన్నో జన్మల పుణ్య చేసుకుంటే గాని దక్కించుకోరు. తెరపై మంచి తనంతో కనిపించే కొంత మంది హీరోలు తెరవెనుక కూడా మంచితనంతో ఉంటారు. అలాంటి వారిలో విశాల్ ఒకరు. కోలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం అక్కడ జనాలను సినిమాలతోనే కాకుండా తన మంచి తనంతోను ఆకట్టుకుంటున్నాడు.
అప్పుడపుడూ ప్రజల సమస్యలపై స్పందిస్తున్నాడు. అవసరమైతే తనే సమస్యలపై పోరాటం చేయడానికి కూడా వెనుకాడడం లేదు ఈ యువహీరో. రీసెంట్ గా చెన్నై రైతుల కోసం ఢిల్లీ వరకు వెళ్లి యూనియన్ ఫైనాన్స్ మినిష్టర్ అరుణ్ జైట్లీ తో మాట్లాడి రైతు సమస్యలను పరిష్కరించడంలో తనవంతు పాత్రను పోషించాడు. అయితే చెన్నైలో ప్రస్తుతం మరికొంతమంది రైతులు కరువుతో పంట చేతికందక ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీంతో మరోసారి విశాల్ తన మంచితనాన్ని చాటుకున్నాడు.
ఈ రోజు విశాల్ హీరోగా నటించిన 'తుప్పరివాలన్' అనే డిటెక్టీవ్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ కాబోతోంది. తనే నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు అమ్ముడుపోయే ప్రతి టికెట్ లోని ఒక్కో రూపాయి తీసి ఎంత వస్తే అంత పేద రైతు కుటుంబాలకు అందజేస్తానని చెప్పాడు.ఇప్పటికే ఈ హీరో చాలా సార్లు రైతులను ఆదుకున్నాడు. ఇప్పుడు ఈ విధానంతో మరో సారి తన మంచితనాన్ని చాటుకుంటున్నాడు. ప్రస్తుతం విశాల్ తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అలాగే సమయం వస్తే రాజకీయాల్లోకి కూడా అడుగులు వేస్తానని సిగ్నల్ ఇచ్చేశాడు. మరి ఎంతవరకు ఈ యువ హీరో అనుకున్నది సాధిస్తాడా చూడాలి.