Begin typing your search above and press return to search.
తారక్ ని ఎంత మాటన్నాడు!
By: Tupaki Desk | 28 Oct 2018 6:58 AM GMTయంగ్ యమ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన `టెంపర్` ఎంతటి బ్లాక్ బస్టరో తెలిసిందే. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యంగ్ యమ విరవిహారం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూశాం. దయా దయాగాడి టెంపర్ అంటూ ఎన్టీఆర్ ఇరగదీసేశాడు. అవినీతి పోలీస్ గా తారక్ నటన నభూతోనభవిష్యతి. అలాంటి ఉద్విగ్నభరితమైన పాత్రతో సమాజానికి అంతో ఇంతో సందేశం ఇవ్వాలన్న ప్రయత్నం పెద్ద స్థాయిలో సఫలమైంది.
సంఘంలో మదపిచ్చి పట్టి తిరిగే బడాబాబుల పిల్లలు వేసే రేప్ వేషాలపై అద్భుతంగా చూపించారు ఈ చిత్రంలో. రేప్ చేస్తే చేసిన వాడికి ఎలాంటి శిక్ష ఉండాలి? దుబాయ్ తరహా కఠిన శిక్షలు మనకు కూడా ఉండాలి అని చెప్పారు పూరి. అందుకే ఆ సినిమాని ఆడవాళ్లు కూడా సెంటిమెంట్ ఫీలై చూశారు. పూరి మార్క్ రగ్గ్‌డ్ హీరోయిజం తారక్ కి అచ్చొచ్చింది. చాలా ఫ్లాపుల తర్వాత తారక్ కి కంబ్యాక్ మూవీ అయ్యింది. అందుకే ఇప్పుడు టెంపర్ రీమేక్ లో విశాల్ నటిస్తున్నాడు అనగానే అందరి కళ్లు అటువైపే ఉన్నాయి. ఈ చిత్రానికి `అయోగి` అనే టైటిల్ ని ఎంపిక చేసుకుని విశాల్ నటిస్తున్నాడు.
అయితే అయోగి కథకు టెంపర్ కథకు చాలానే మార్పు చేర్పులు ఉంటాయని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో విశాల్ వెల్లడించారు. క్లైమాక్స్ చాలా వరకూ మారుతుంది. ప్రస్తుత సమాజాన్ని కళ్లకు గట్టేలా ఉంటుంది ఈ చిత్రం. మీటూ ఉద్యమంపైనా ఇందులో ప్రస్థావిస్తున్నాం. క్లైమాక్స్ లో ప్రధానంగా ఈ ఉద్యమం ఇన్ బిల్ట్ చేశామని విశాల్ తెలిపారు. ప్రస్తుత సంఘానికి ప్రతిబింబంగా ఉంది కాబట్టే రీమేక్ అయినా నటించానని విశాల్ అన్నారు. తనకు స్ట్రెయిట్ సినిమాలతోనే సమయం చిక్కడం లేదు. అలాంటిది రీమేక్ లలో నటించగలనా? అని అన్నారు. ప్రస్తుతం పందెంకోడి 3, అభిమన్యుడు 2 - డిటెక్టివ్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నానని వెల్లడించారు. అభిమన్యుడు 2 చిత్రం వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేస్తామని అన్నారు. మరో ముఖ్యమైన పాయింట్ ని స్ట్రెస్ చేసి మీడియా ప్రశ్నించింది. `టెంపర్` రీమేక్ అయోగిని తెలుగులోనూ రిలీజ్ చేస్తారా? అని ప్రశ్నిస్తే .. తనకు భయం అని అన్నారు. తారక్ తో పోల్చి చూస్తారు. తారక్ లా చేయలేదని ఇక్కడ ఫ్యాన్స్ అంటారు. అందుకే భయం. ఇక్కడ రిలీజ్ చేయను.. అని అన్నారు. తాను తారక్ అంత బాగా నటించలేనని కూడా విశాల్ అంగీకరించారు. ఒక హీరో వేరొక హీరోని పొగిడేస్తూ ఇలా ఈగోలెస్ గా తెలివిగా మాట్లాడడం విశాల్ కి తప్ప వేరొకరికి సాధ్యం కాదేమో!!!