Begin typing your search above and press return to search.

పందెం కోడి రేట్ బాగా పలుకుతోందే

By:  Tupaki Desk   |   19 Aug 2018 6:30 AM GMT
పందెం కోడి రేట్ బాగా పలుకుతోందే
X
కొన్ని హిట్ మూవీస్ కి ఎక్స్ పైరీ అంటూ ఉండదు. ఎంత గ్యాప్ వచ్చినా వాటికి సీక్వెల్ వస్తోంది అంటే ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి మొదలవుతుంది. ఆ కోవలో వచ్చేదే విశాల్ పందెం కోడి. అప్పుడెప్పుడో 13 ఏళ్ళ క్రితం విశాల్ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్ గా పూర్తి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది. దాని తర్వాతే విశాల్ మనవాళ్లకు బాగా కనెక్ట్ అయ్యాడు. కరెక్ట్ గా చెప్పాలంటే దాన్ని దాటే హిట్ రేంజ్ వేరే సినిమాతో విశాల్ మళ్ళి అందుకోలేకపోయాడు. అంతలా ప్రభావం చూపిన ఆ మూవీ వల్లే దర్శకుడు లింగుస్వామి టాలెంట్ ని మనవాళ్ళు గుర్తించారు. ఇప్పుడు దీనికి కొనసాగింపు వస్తోంది. పందెం కోడి 2 పేరుతో తెలుగులో కూడా దసరాకే రానున్న ఈ మూవీ బిజినెస్ మంచి స్వింగ్ లో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటిదాకా కేవలం థియేట్రికల్ రైట్స్ మాత్రమే 10 కోట్ల దాకా అమ్మేసినట్టు టాక్. దీనికి డిజిటల్ శాటిలైట్ ఆన్ లైన్ లాంటివి కలపలేదు. అవి అదనంగా వస్తాయి.

విశాల్ కు ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే ఇది చాలా పెద్ద మొత్తం. ఇటీవల వచ్చిన చెప్పుకోదగ్గ హిట్ అభిమన్యుడు తప్ప గత ఐదేళ్లుగా విశాల్ గర్వంగా చెప్పుకునే సినిమా తెలుగులో ఒక్కటి కూడా రాలేదు. తమిళ్ లో బాగా ఆడిన డిటెక్టివ్ సైతం ఇక్కడ బిలో యావరేజ్ గా మిగిలింది. ఈ నేపథ్యంలో పందెం కోడి 2కు ఇంత బిజినెస్ జరగడం విశేషం. నైజామ్ స్వంతంగా రిలీజ్ చేసి సీడెడ్ ని ఇంకా ఆఫర్ లో పెట్టినట్టు తెలిసింది. నెల్లూరు గుంటూరు ను యూవీ సంస్థకు ఇచ్చేయగా ఆంధ్ర ఏరియాకే 6 కోట్ల దాకా వచ్చిందని టాక్. ప్రమోషన్ కూడా మొదలుపెట్టకుండానే పందెం కోడి 2 ఇంత రాబట్టడం చిన్న విషయం కాదు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవకు కేవలం ఒక్క వారం గ్యాప్ తో అక్టోబర్ 18న వస్తున్న పందెం కోడి 2 ఫలితం మీద విశాల్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తమిళ్ ఆడియో ట్రాక్స్ ని ఒక్కొక్కటిగా రేపటి నుంచి విడుదల చేయబోతున్నారు తెలుగు వెర్షన్ మాత్రం టీజర్ తో మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడున్న పోటీ వల్ల అభిమన్యుడు తమిళ్ కంటే చాలా లేట్ గా రిలీజ్ చేసిన విశాల్ తమిళ్ తెలుగు పందెం కోడి 2 మాత్రం ఖచ్చితంగా ఒకే రోజు వస్తాయని గతంలోనే ప్రకటించాడు.