Begin typing your search above and press return to search.
పందెం కోడి మరో పందానికి సిద్దం
By: Tupaki Desk | 30 July 2017 5:22 AM GMTతమిళ్ హీరోలు ఇప్పుడు చేస్తున్న అన్ని సినిమాలు రెండు రాష్ట్రాల అభిమానులును దృష్టిలో ఉంచుకొని చేస్తున్నారు. అక్కడ టాప్ హీరోలుగా ఉన్న అందరి సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేసి అక్కడ తమిళ్ సినిమాతో పాటుగా ఇక్కడ మన తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. కమల్ - రజిని - సూర్య - విక్రమ్ - కార్తీ - విజయ్ - అజిత్ - అదే వరుసలో ఇప్పుడు విశాల్ - ధనుష్ కూడా చేరిపోయారు. విశాల్ తన మొదటి సినిమా నుండే కథ పై నమ్మకం ఉన్న ప్రతీ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేయించి విడుదల చేస్తున్నాడు. ఇంకా విశాల్ ప్రొడ్యూసర్ గా మారినప్పటి నుండి అయితే అన్ని సినిమాలను అదేపనిగా విడుదల చేస్తున్నాడు.
కొన్నేళ్ళ కిందట లింగుస్వామి డైరక్షన్లో విశాల్ హీరో గా మీరా జాస్మిన్ హీరోయిన్ గా వచ్చిన పందెంకోడి తెలుగులో మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా తమిళనాడులో విశాల్ సినిమాలలోనే పెద్ద సూపర్ హిట్ సినిమాగా మిగిలిపోయింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నారు అని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేశ్ అని అనుకుంటున్నారు. ఆగష్టు చివరి వారంలో షూటింగ్ కూడా మొదలుకావచ్చు అని చెబుతున్నారు పందెంకోడి2 టీమ్. ఈ సినిమాలో మరో స్పెషాలిటీ ఏంటంటే.. తమిళ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ పాత్రలో కనిపించబోతుంది. అసలు పందెంకోడి 2 సినిమాలో వరలక్ష్మి పాత్ర హైలైట్ అవుతుంది అని చెబుతున్నారు.
గతంలో పందెం కోడి సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం కూడా ఈ సినిమా విజయంలో మంచి క్రియాశీలక పాత్ర పోషించింది. మరి ఇప్పుడు ఈ సీక్వెల్ సినిమాకు సంబంధించిన మిగతా క్రియేటివ్ టీమ్ వివరాలు ఏంటో ఎవరో తెలియవలిసి ఉంది. హీరో విశాల్ కి తెలుగులో మంచి మార్కెటే ఉంది. అలాగే డైరెక్టర్ లింగుస్వామి సినిమాలు రన్ - ఆవరా లాంటి సినిమాలుతో తెలుగులోను మంచి పేరు తెచ్చుకున్నాడు. మరి వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న పందెంకోడి2 ఎంత వరకు అభిమానులు అంచనాలు చేరుకుంటుందో చూడాలి.