Begin typing your search above and press return to search.

విశాల్‌ కు అక్కడ, ఇక్కడ సవాలే!!

By:  Tupaki Desk   |   17 Oct 2018 3:28 AM GMT
విశాల్‌ కు అక్కడ, ఇక్కడ సవాలే!!
X
తమిళ స్టార్‌ హీరో విశాల్‌ సక్సెస్‌ ఫ్లాప్‌ లతో సంబంధం లేకుండా సంవత్సరంలో రెండు మూడు సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తమిళంలో విశాల్‌ చేసిన ప్రతి ఒక్క సినిమా తెలుగులో డబ్‌ అవుతున్నాయి. అయితే అలరిస్తున్న సినిమాల సంఖ్య మాత్రం తక్కువే అని చెప్పక తప్పదు. విశాల్‌ కు తెలుగులో సాలిడ్‌ సక్సెస్‌ దక్కి చాలా రోజులే అయ్యింది. తాజాగా విశాల్‌ నటించిన ‘సండకోలి 2’ చిత్రం తెలుగులో ‘పందెంకోడి 2’ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులో విశాల్‌ కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన చిత్రం ‘పందెం కోడి’. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ గా తెరకెక్కిన ఈ చిత్రం కూడా తప్పకుండా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

రేపు తమిళం మరియు తెలుగులో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ చిత్రంకు అక్కడ ఇక్కడ గట్టి పోటీ ఎదురవుతోంది. తమిళంలో ఈ చిత్రంతో పాటు ‘వడా చెన్నై’ విడుదల కాబోతుంది. ఆ చిత్రం నుండి సండకోలి 2 చిత్రం గట్టి పోటీని ఎదుర్కొంటోంది. మరో వైపు తెలుగులో ఇప్పటికే విడుదలైన అరవింద సమేత చిత్రంతో పాటు, రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్‌ ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రం కూడా విశాల్‌ పందెం కోడి 2 చిత్రంకు గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది.

ఇంత పోటీ ఉన్న నేపథ్యంలో సినిమాకు పర్వాలేదు అనే టాక్‌ వస్తే సరిపోదు. ఖచ్చితంగా హిట్‌ టాక్‌ వస్తేనే కలెక్షన్స్‌ ఆశించిన రేంజ్‌ లో వస్తాయంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. చిత్ర యూనిట్‌ సభ్యులు తెలుగు మరియు తమిళంలో ఈ చిత్రం హిట్‌ దక్కించుకుని కలెక్షన్స్‌ వర్షం కురవడం ఖాయం అంటూ నమ్మకంగా చెబుతున్నారు. మరి వారి నమ్మకం ఏ మేరకు నిలుస్తుంది, విశాల్‌ అక్కడ, ఇక్కడ సవాల్‌ లను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి