Begin typing your search above and press return to search.
హ్యాట్సాఫ్: కంగనను భగత్ సింగ్ తో పోల్చాడు
By: Tupaki Desk | 11 Sep 2020 4:30 AM GMTక్వీన్ కంగన రనౌత్ వీరత్వం గురించి ఏమని చెప్పాలి? ఎంతని చెప్పాలి? ముంబై - మహారాష్ట్రలో పేరున్న మొనగాళ్లం అని చెప్పుకునే శివసేన అధినాయకులకే ముచ్చెమటలు పట్టించిన కంగనకు హ్యాట్సాఫ్ చెబుతూ .. తనను భగత్ సింగ్ తో పోల్చాడు హీరో విశాల్.
గత రెండు మూడు రోజులుగా శివసేన వర్సెస్ కంగన ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. ముంబైలో తన ఆఫీసును కుప్పకూల్చిన మున్సిపల్ శాఖపైనా కంగన న్యాయపోరాటానికి దిగింది. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ గా అభివర్ణించి తన ధీరత్వాన్ని ప్రదర్శించడంతో శివసేనకు ఒళ్లు మండి తనని ఇలా సాధిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ముంబై ఇలాకాలో అడుగు పెడుతున్నా కాస్కో! అంటూ సవాల్ విసిరి మరీ నగరంలోకి దిగింది మనాలి నుంచి.
బహుశా హీరో విశాల్ అందుకే ఇంప్రెస్ అయ్యాడేమో! మహారాష్ట్ర పాలక శివసేనతో ముఖాముఖిలో దంచి కొట్టిన కంగనా రనౌత్ ను స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ తో పోల్చారు విశాల్. తప్పు కానప్పుడు ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఏమాత్రం వెనకాడకూడదని భావించే ఈ నటుడు కంగన ధీరత్వాన్ని పొగిడేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
``మీ ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్. ఏది సరైనది? ఏది తప్పు? అని మీరు రెండుసార్లు ఆలోచించలేదు. ఇది మీ వ్యక్తిగత సమస్య కాదు. కానీ అలాంటప్పుడు కూడా ప్రభుత్వం నుంచి కోపాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మీరు ధృఢంగా ఎదురొడ్డి నిలిచారు. అది చాలా గొప్ప విషయం. 1920 లో భగత్ సింగ్ చేసినదాంతో ఇది సరి సమానమైనది`` అని విశాల్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. వాక్ స్వాతంత్య్ర ం ప్రకారం ఒక ప్రముఖురాలిగా కాకుండా సామాన్యురాలి లాగా తప్పును ఎదురిస్తూ మాట్లాడినందుకు మీకు నా నమస్కారాలు అంటూ గౌరవించాడు విశాల్.
ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్న కంగన రనౌత్ ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో తన ఇమేజ్ అమాంతం పెరిగింది. ఇక బీఎంసీ ఎపిసోడ్ సహా శివసేన వీరంగం చూశాక... కేంద్ర ప్రభుత్వం ఆమెకు సాయుధ భద్రత ఇవ్వడంతో ముంబైలో రాజకీయం రసవత్తరంగా మారింది. కంగన రనౌత్ కు బిజెపి మద్దతు ఇచ్చిందని సేన ఆరోపించింది.