Begin typing your search above and press return to search.

విశాల్ ఆశ ఈసారి కూడా తీరలేదు

By:  Tupaki Desk   |   11 May 2016 5:53 AM GMT
విశాల్ ఆశ ఈసారి కూడా తీరలేదు
X
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ విశాల్ ముందు రచ్చ గెలిచాడు. ఆ తర్వాత ఇంట్లో కూడా విజయం సాధించాడు. కానీ ఆ విజయాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. కెరీర్ ఆరంభంలో తెలుగులో మంచి మార్కెట్ సంపాదించిన ఈ యాక్షన్ హీరో.. ఆ తర్వాత వరుసగా రొడ్డకొట్టుడు సినిమాలు చేసి.. ఆ మార్కెట్ అంతా కోల్పోయాడు. మధ్యలో మళ్లీ తమిళంలో పుంజుకుని తిరిగి వరుస హిట్లు కొట్టినా మళ్లీ తెలుగులో మాత్రం ఆదరణ పెంచుకోలేకపోయాడు. అతడి సినిమాలు తమిళంలో బాగానే ఆడుతున్నాయి కానీ.. తెలుగులోకి వచ్చేసరికి తుస్సుమంటున్నాయి. సరైన టైమింగ్ లో రిలీజ్ చేయకపోవడం.. సరిగా ప్రమోట్ చేయకపోవడం కూడా దీనికి కారణమే.

ఇంతకుముందు లాగా తమిళంతో పాటే తెలుగులోనూ ఒకేసారి తన సినిమాల్ని రిలీజ్ చేయాలని విశాల్ చూస్తున్నాడు కానీ.. అందుకు వీలు చిక్కడం లేదు. ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతోంది. సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉండటంతో ‘కథకళి’ని రిలీజ్ చేసుకోలేకపోయాడు. మార్చిలో పరీక్షల సీజన్లో రావడం వల్ల ఆ సినిమాను జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడు తన కొత్త సినిమా ‘రాయుడు’ను భారీ లెవెల్లో ఒకేసారి తెలుగులోనూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. ఈ నెల 20న డేట్ ఫిక్స్ చేసుకున్నాడు.

కానీ అనుకోకుండా ‘బ్రహ్మోత్సవం’ వచ్చిపడింది. తమిళంలో ఆ డేటే ఫిక్స్ చేసేసి రిలీజ్ కు ఏర్పాట్లు పూర్తి చేసేయడంతో వెనక్కి తగ్గడానికి అవకాశం లేదు. మరి ఇక్కడ ‘బ్రహ్మోత్సవం’తో పోటీ పడే పరిస్థితి లేదు. ఒకవేళ పోటీ పడ్డా అడ్రస్ గల్లంతయిపోతుంది. కాబట్టి మరోసారి తెలుగులో తన సినిమాను లేటుగా రిలీజ్ చేసుకోవాల్సిందే విశాల్.