Begin typing your search above and press return to search.
'మీ టూ' కి పోటీగా 'వీ టూ'
By: Tupaki Desk | 27 Oct 2018 10:46 AM GMTగత కొంతకాలంగా మీటూ ఉద్యమం ఇండియాని ఊపేస్తున్న సంగతి తెలిసిందే. ఇది సౌత్ సినీపరిశ్రమల్లోనూ జోరందుకుంటోంది. ఇటీవలే అర్జున్ పై ఓ కథానాయిక లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనమయ్యాయి. ఇదివరకూ పలువురు తమిళ స్టార్లపైనా శ్రీరెడ్డి వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై పందెంకోడి 2 సక్సెస్ ఇంటర్వ్యూలో విశాల్ ని ప్రశ్నిస్తే షాకిచ్చే ఆన్సర్ ఇచ్చారు.
నాడు శ్రీరెడ్డి ఆరోపణల వేళ నేను - కార్తీ వెంటనే స్పందించాం. ఎవరికైనా బాధితులకు సాయపడాలన్నదే మా ఉద్ధేశం. నటీమణులను వేధింపుల వ్యవహారాల నుంచి కాపాడేందుకు కోలీవుడ్ లో ప్రత్యేకించి ఓ కౌన్సిలింగ్ సెల్ ని ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే ఇటీవల మీటూ ఉద్యమం మాత్రం చాలా ప్రమాదకరంగా మారిందని - ఇది డేంజరస్ ట్రెండ్ అని విశాల్ అన్నారు. నేను ఏ తప్పూ చేయను. కానీ వేరే కారణాలతో నా పేరును మీటూ ఉద్యమంలో చేర్చి ఆరోపిస్తే నా పరువు మర్యాదలు ఏమైపోవాలి? నా పేరు అంతా వెంటనే చెడుతుంది. పేరు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడాలి. కానీ ఓవర్ నైట్ లోనే అది కోల్పోతాం ఏవైనా ఆరోపణలు ఎదురైతే. అయితే తప్పుడు ఆరోపణ అయితే దానిని తట్టుకోలేం కదా? అని విశాల్ అన్నారు. మీటూలో చెడు ఎక్కువగా జరుగుతోందని అభిప్రాయపడ్డారు.
అందుకే ఇటీవల వరలక్ష్మి ఓ మాట అంది. మహిళా బాధితులకు మీటూ ఉన్నట్టే అబ్బాయిలకు `వీ టూ` కూడా ఉంది. వెళ్లి విశాల్‌ని కలవండి.. అతడి నుంచి మగాళ్లకు రక్షణ తప్పనిసరిగా దొరుకుతుంది అని వరలక్ష్మి అందరికీ సూచిస్తోందని విశాల్ నవ్వేస్తూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ వరలక్ష్మితో పెళ్లెప్పుడు? అని ప్రశ్నిస్తే.. తను నా బెస్ట్ ఫ్రెండ్.. సోల్ మేట్!! అంటూ యథావిధిగా మరోసారి నవ్వేస్తూ సమాధానం దాట వేశాడు. నడిగర సంఘం బిల్డింగ్ సాధ్యమైనంత తొందర్లోనే ప్రారంభిస్తున్నామని, నిర్మాణం పూర్తి కావచ్చిందని తెలిపాడు. అమ్మాయిని వెతికారా? అని ప్రశ్నిస్తే .. ముహూర్తం బ్లాక్ చేశా.. అమ్మాయిని బ్లాక్ చేయాలి! అంటూ పంచ్ వేశాడు విశాల్.