Begin typing your search above and press return to search.
నడిగర్ ఎన్నికల్లో విశాల్ సన్నివేశమే ఇప్పుడు ప్రకాష్ రాజ్ కి!
By: Tupaki Desk | 25 Jun 2021 11:07 AM GMTమూవీ ఆర్టిస్ట్ ల సంఘం (మా) ఎన్నికలు రసవత్తర పోరును తలపిస్తున్నాయి. సెప్టెంబర్ లో జరగనున్న ఎన్నికల్లో చతుర్మఖ పోటీ ఉత్కంఠకు తెర లేపింది. ప్రకాష్ రాజ్- మంచు విష్ణు మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. జీవిత- హేమ పోటీబరిలో ఉన్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమగా ఉన్నారు. అధ్యక్ష బరిలో నిలిచిన వారు ఒక్కొక్కరుగా తమ ఫ్యానల్ సభ్యుల్ని ప్రకటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన టీమ్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వాతావరణం మరింత వేడెక్కింది. మా లో గతంలో కీలక పదువులు చేపట్టిన వారంతా ప్రకాష్ రాజ్ వెంట ఉన్నారని తెలుస్తోంది. దీంతో ప్రకాష్ రాజ్ పై ప్రత్యర్ధి ఫ్యానల్స్ ఆయన్ని నాన్ లోకల్ అనే ఫీలింగ్ ని తీసుకొచ్చే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నాయి.
వాస్తవానికి పోటీ బరిలో నిలిచే వారికి లోకల్ -నాన్ లోకల్ అనే నిబంధన లేదు. `మా` లో మెంబర్ గా ఉంటే ఎవరైనా అధ్యక్ష పదవికి పోటీ పడవచ్చు. ప్రకాష్ రాజ్ ఇప్పుడు చేస్తున్నది అదే. అయితే ఆయన తెలుగు నటుడు కాదు. పర భాష నటుడు కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కుపెడుతోంది ప్రత్యర్థి బృందం. దీంతో ప్రకాష్ రాజ్ కూడా అవేదన వ్యక్తం చేస్తున్నారు. పోటీ చేయడానికి లోకల్-నాన్ లోకల్ ఫీలింగ్ ఏంటి? ఎందుకు ఈ రచ్చ తెరపైకి తీసుకొస్తున్నారో అర్ధం కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. `మా` లో గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి కనిపించలేదన్నారు. చిత్తశుద్దితో పనిచేసే ఫ్యానల్ తమదని చెప్పుకొచ్చారు.
మరో వైపు మెగా ఫ్యామిలీ మద్ధతు కూడా ప్రకాష్ రాజ్ ఫ్యానల్ కి దక్కడంతో గెలుపు నల్లేరు మీద నడక అనే చందంగా ప్రచారం సాగుతోంది. అందరి మద్ధతుతో ప్రకాష్ రాజ్ గెలుస్తారా? ఫలితాలు ప్రత్యర్ధులకు అనుకూలంగా ఉంటాయా? అన్నది పక్కన బెడితే! గతంలో ఇలాంటి సమస్యనే నడిగర్ సంఘం(తమిళ పరిశ్రమ)లో తెలుగు నటుడైన విశాల్ ఎదుర్కున్నారు. విశాల్ నడిగర్ సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ కి దిగినప్పుడు ప్రత్యర్ధి ఫ్యానల్స్ ...స్థానిక నటులు కొంత మంది అగ్ర హీరోలు ఏకమై విశాల్ ని ఓడించాలని కంకణం కట్టుకుని పనిచేసారు. ఆయనపై వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేసారు. కానీ విశాల్ ఎత్తుకు పై ఎత్తులు వేసి నడిగర్ సంఘం ఎన్నికల్లో గెలిచి చూపించారు. మరి ఇప్పుడు ప్రకాష్ రాజ్ అదే సీన్ ని టాలీవుడ్ లో రిపీట్ చేస్తారా? అన్నది వేచి చూడాలి.