Begin typing your search above and press return to search.

బన్నీ స్పెషల్ సాంగ్ కథాకమామిషూ

By:  Tupaki Desk   |   12 Jan 2018 5:41 AM GMT
బన్నీ స్పెషల్ సాంగ్ కథాకమామిషూ
X
సౌత్ లో స్టైలిష్ హీరోలు చాలా మందే ఉన్నారు. నటనలో డ్యాన్సులలో అలాగే యాక్షన్ సీన్స్ లలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే టాప్ 5 సౌత్ టాలెంటెడ్ హీరోల లిస్టును తీస్తే అందులో అల్లు అర్జున్ ఉంటాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ డ్యాన్సులు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. అలాగే నటనలో యాక్షన్ సీక్వెన్స్ లలో మనోడి స్టైలే వేరు. ఊర మాస్ లో కూడా తన సత్తా ని చూపిస్తాడు.

ముఖ్యంగా బన్నీ స్పీడ్ స్టెప్పులు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రతి ఒక్క సౌత్ అభిమానికి తెలుసు. బన్నీతో సినిమాను ఒకే చేసిన సంగత దర్శకులకు ఒక ఛాలెంజ్ వర్క్ లా ఉంటుందని చెప్పాలి. అతని స్పీడ్ కు మ్యూజిక్ కూడా వెనుకబడిపోతుంది. అందుకు తగ్గట్టు బన్నీ కి లెవెల్ గా మ్యూజిక్ ఇవ్వడానికి మ్యూజిక్ డైరెక్టర్స్ కష్టపడుతుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ ఫెమాస్ మ్యూజిక్ జోడి విశాల్ - శేఖర్ కూడా స్టైలిష్ స్టార్ కు ఒక స్పెషల్ సాంగ్ ని క్రియేట్ చేస్తున్నారట. నా పేరు సూర్య సినిమాలో డ్యాన్స్ మూమెంట్స్ ఓ లెవెల్లో ఉండాలని బన్నీ కూడా అనుకుంటున్నాడు. అంతర్జాతీయ కొరియోగ్రాఫర్ లతో పారిస్ మరియు అమెరికా వంటి లొకేషన్లలో చిత్రీకరించాలని అనుకుంటున్నారు.

సినిమాలో బన్నీ పెర్ఫెమెన్స్ కి తగ్గట్టు ధీటుగా ఆ సాంగ్ ఉండనుందట. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో హల్ చల్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న నా పేరు సూర్య సినిమా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అను ఇమ్మన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమాను ఎప్రిల్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాత లగడపాటి శ్రీధర్ ప్రయత్నాలు చేస్తున్నారు.