Begin typing your search above and press return to search.
విశాల్ మగాడండీ..
By: Tupaki Desk | 28 April 2018 6:53 AM GMTవిశాల్ అనేవాడిని తొలి సినిమా ‘చెల్లమే’ (తెలుగులో ప్రేమ చదరంగం)లో హీరోగా చూసి.. ఇతను హీరో ఏంటి అన్నారు. కానీ ‘పందెం కోడి’తో తనేంటో రుజువు చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంతింతై అన్నట్లు ఎదిగాడు. తమిళంలో విశాల్ స్టార్ హీరోగా ఎదగడం ఒకెత్తయితే.. పెద్ద పెద్ద వాళ్లను ఎదిరించి నడిగర్ సంఘం.. తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో గెలవడం మరో ఎత్తు. వీటిలో కీలక పదవులు చేపట్టిన విశాల్.. పరిశ్రమ కోసం గట్టిగానే పాటుపడుతున్నాడు. ఇటీవలే నెలన్నర పాటు తమిళ పరిశ్రమ సమ్మె చేసి తమ సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో విశాల్ ది కీలక పాత్ర. తమిళ పరిశ్రమలో ఎందరో ఉద్ధండులు ఉన్నప్పటికీ విశాల్ లాగా నాయకత్వ లక్షణాలు అందరికీ లేవనే చెప్పాలి. తెలుగువాడైన విశాల్.. అక్కడ నాయకుడిగా ఎదిగి.. ఎవరినైనా ప్రశ్నించే స్థితిలో ఉన్నాడిప్పుడు.
ఎంతటి వాళ్ల మీదైనా విశాల్ ధైర్యంగా విమర్శలు చేయగలడు. తాజాగా అతను కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు ఒక కౌంటర్ వేయడం విశేషం. అజిత్ లో చాలా మంచి లక్షణాలు ఉన్నాయని అంటూనే.. ఆయనలోని ఒక చెడ్డ లక్షణం గురించి కూడా చెప్పాడు విశాల్. అజిత్ జనాలకు దొరకకుండా చాలా దూరంగా ఉండిపోతారని.. ఏ విషయంలో అయినా ఆయన్ని సంప్రదించడం కష్టమని అన్నాడు. నడిగర్ సంఘం కార్యదర్శిగా.. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ కొన్ని కార్యక్రమాల కోసం అజిత్ ను సంప్రదించాలని చూస్తే అతను దొరకలేదట. ఈ నేపథ్యంలోనే విశాల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మరో స్టార్ హీరో విజయ్ గురించి మాట్లాడుతూ.. అతను చాలా కష్టపడి.. పోరాడి ఇప్పుడున్న స్థాయికి చేరాడని.. తమిళంలో డ్యాన్స్ పరంగా విజయ్ కి పోటీ ఇచ్చేవాళ్లే లేరని విశాల్ వ్యాఖ్యానించడం విశేషం.