Begin typing your search above and press return to search.
జల వివాదాలపై స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 1 July 2017 6:07 PM GMTఇటీవల రాజకీయాలకు సంబంధించిన అంశాలపై చురుకుగా స్పందిస్తున్న కోలివుడ్ - టాలీవుడ్ సినీ నటుడు విశాల్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా కర్ణాటక-తమిళనాడుల మధ్య భగ్గుమనే పరిస్థితికి కారణం అయిన కావేరి జలాల గురించి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ - కమల్ - విజయ్ తదితరులు కావేరీ జలాల అంశంపై చెన్నైలో నిరాహార దీక్ష చేయగా...దీనిపై కన్నడిగులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సహజంగా ఈ జలాల గురించి మాట్లాడి జగడం ఎందుకు పెంచుకోవాలని అంతా ఆలోచిస్తుంటే...ఏకంగా కర్ణాటక రాష్ట్ర రాజధాని అయిన బెంగళూరులోనే అది కూడా తమిళంలో మాట్లాడి కలకలం సృష్టించారు.
బెంగళూరు జరిగిన ఓ ఆడియో ఫంక్షన్ కు హాజరైన విశాల్ ఈ సందర్భంగా పూర్తిగా తమిళంలోనే మాట్లాడుతూ వివాదాస్పదమైన కావేరీ జలాలపై స్పందించారు. ``ఈ దేశంలో ఉన్న మనమంతా భారతీయులం. పరస్పరం అభిప్రాయాలు పంచుకోవాలి. నీళ్లు అడగడం మా హక్కు. దాన్ని ఎవరూ కాదనలేరు. తమిళంలో మాట్లాడటానికి నేను గర్విస్తున్నాను. అలా మాట్లాడకుండా నన్నెవరూ ఆపలేరు కూడా. అందుకే నేను తమిళ ప్రజల తరఫున నీటి ఆకాంక్షను చాటుతున్నాను. కన్నడ గడ్డపై ఉన్న తమిళ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడి వారికి ఉంది` అని స్పష్టం చేశారు.
తమిళ నిర్మాత మండలి అధ్యక్షుడు - నడిగర సంఘం కార్యదర్శి కూడా విశాల్ సినీ పరిశ్రమ గురించి ప్రస్తావిస్తూ కన్నడ నిర్మాతలు సినిమా తీసేందుకు తమిళనాడు వస్తే వారికి అవసరమైన అన్ని సహాయసహకారాలు తాము అందిస్తామని ప్రకటించారు. తమిళరాష్ట్రంలో ఉన్న కన్నడ ప్రజల భధ్రతను కాపాడాల్సిన బాధ్యత తమిళులదేనని తెలిపారు. ఇరు రాష్ర్టాల ప్రజలు పరస్పరం గౌరవించుకోవడం ద్వారా సంబంధాలు పెంచుకోవాలని కోరారు. తమ సమస్యలను సైతం సామరస్యపూర్వక దోరణిలో పరిష్కరించుకోవాలని చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/