Begin typing your search above and press return to search.
రజనీకాంత్ నిర్మాత నిద్రపోతున్నాడా?
By: Tupaki Desk | 18 May 2016 3:30 PM GMT''ఇంతవరకు పైరసీ జరిగి 10 రోజులు కావొస్తున్నా కూడా.. అసలు సినిమాను ప్రదర్శించిన ధియేటర్ మీద కాని.. పైరసీ చేయడానికి ఇన్ డైరెక్టుగా సహకారం అందించిన ఆ మాల్ పై గాని.. యాక్షన్ అనేదే తీసుకోలేదు'' అంటున్నాడు విశాల్.
సూర్య హీరోగా వచ్చిన ''24'' సినిమాను రిలీజ్ రోజునే సాయంత్రం 4 గంటల షో కు.. బెంగుళూరులోని ఓరియన్ మాల్ లో.. పి.వి.ఆర్. సినిమాస్ స్ర్కీన్ నెం.3లో పైరసీదారులు రికార్డు చేసేశారు. ఆ తరువాత రాత్రికే సినిమా ఆన్ లైన్ లో రిలీజ్ అయిపోయింది. ఈ సినిమాను పలానా ధియేటర్ లో రికార్డు చేశారంటూ క్యూబ్ డిజిటెల్ ప్రొజెక్షన్ సిస్టమ్ వారు అఫీషియల్ రిజల్టు కూడా డిక్లేర్ చేశారు. అయినాసరే తమిళ ప్రొడ్యూసర్ల సంఘం మాత్రం.. సదరు పివిఆర్ ను కాని.. లేదా ఆ మాల్ ను కాని.. అసలు సినిమాలు స్ర్కీన్ చేయకుండా బ్యాన్ చేసిందే లేదు. ఇదే విషయంపై విశాల్ మాట్లాడుతూ.. నిర్మాతల కౌన్సిల్ సమాధానం చెప్పాలని.. కౌన్సిల్ అధ్యక్షుడు థాను మేల్కోవాలని సూచించాడు విశాల్.
ఇంతకీ ఈ నిర్మాతల అధ్యక్షుడు థాను ఎవరో తెలుసు కదా.. ఆయన రజనీకాంత్ ''కబాలి'' ప్రొడ్యూసర్ అండీ బాబూ. మరి జూలై లో ఒకవేళ కబాలి కూడా పైరసీ చేస్తే అప్పుడు మేల్కొంటారేమో ఆయన అంటూ తమిళనాట అందరూ పంచ్ లు వేస్తున్నారిప్పుడు.