Begin typing your search above and press return to search.
ఒక్కమాటలో చెప్పాలంటే 'ఆర్య' నా ఆస్తి
By: Tupaki Desk | 1 Nov 2021 4:31 AM GMTకోలీవుడ్ లో మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న హీరోల్లో విశాల్ ఒకరుగా కనిపిస్తాడు. మాస్ హీరోగా అక్కడ ఆయనకి మంచి క్రేజ్ ఉంది. తన ప్రతి సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదలయ్యేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అందువలన తెలుగులోను ఆయనకి మంచి మార్కెట్ ఉంది. ఇక్కడ కూడా మాస్ హీరోగా ఆయనకి ఎక్కువ మార్కులు పడుతుంటాయి. అలాంటి విశాల్ తన 20 ఏళ్ల కెరియర్లో 30 సినిమాలకి పైగా చేశాడు.
ఆయన తాజా చిత్రమైన 'ఎనిమి' ఈ నెల 4వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో నిన్నరాత్రి హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై విశాల్ మాట్లాడుతూ .. " ఈవెంట్ కి వచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 4వ తేదీన విడుదలవుతుంది. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నాము.
దాదాపు రెండేళ్ల తరువాత ఇలా అందరం ఒక ఫంక్షన్లో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇండస్ట్రీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయి .. ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. ఇలాంటి ఒక మంచి సమయం కోసం చాలా నెలలుగా ఎదురు చూస్తున్నాము. అన్ని సమస్యలు తొలగిపోయి ఇండస్ట్రీ దార్లో పడటం చాలా ఆనందాన్ని ఇస్తోంది. ముందుగా ఈ సినిమా నిర్మాత వినోద్ కి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆయన లేకపోతే .. 'ఎనిమి' సినిమా లేదు.
ఈ సినిమా కోసం ఆయన 50 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సినిమా నేపథ్యం 'సింగపూర్' .. కానీ అక్కడ షూటింగు చేసే పరిస్థితి లేదు. అది మ్యాచ్ చేస్తూ 'దుబాయ్' తీశాము. పాండమిక్ టైమ్ లో ఇతర దేశాల్లో షూటింగు జరుపుకున్న సినిమా ఇదే. బేస్మెంట్ కరెక్టుగా ఉంటే ఇల్లు బాగా కట్టొచ్చు. ఆ బేస్మెంట్ వినోద్ గారి వలన మాకు అందింది .. అందుకు ఆయనకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఆయన పడిన కష్ఠానికి తగిన ఫలితం లభించాలని కోరుకుంటున్నాను.
ఈ సినిమా ఓటీటీ కోసం ఆయనకి భారీ ఆఫర్ వచ్చింది. టేబుల్ ప్రాఫిట్ తో ఆయనకి అంత మంచి ఆఫర్ వచ్చినప్పటికీ ఆయన నో చెప్పారు. ఈ సినిమా థియేటర్స్ లోనే రావాలనే ఆయన పట్టుదల కారణంగానే ఈ సినిమా థియేటర్స్ కి వస్తోంది. లేకపోతే మనం ఈ సినిమాను థియేటర్స్ లో చూడలేకపోయేవాళ్లం. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నేను చేసిన ఫస్టు మూవీ ఇది. ఆనంద్ శంకర్ మొదటి రోజున మా ఇంటికి వచ్చి కథ చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకూ ఆయనతో నా జర్నీ వండర్ఫుల్ గా సాగింది.
కథలో ఇద్దరు హీరోలు ఉంటారు .. ఇంకో హీరోకి నేను స్పేస్ ఇస్తానా? అనే ఒక డౌట్ ఆనంద్ శంకర్ కి ఉంది. నాతో తలపడే పాత్రను ఆర్య చేస్తే బాగుంటుంది. ఆర్య పాత్రను పెంచి నా పాత్రతో సమానంగా నడిపిస్తే బాగుంటుందని నేను చెప్పాను. అప్పుడు ఆయన ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాడు. ఆయన ఏదైతే చెప్పాడో అవుట్ పుట్ అలాగే వచ్చింది. నేను .. మమత మోహన్ దాస్ చాలా కాలం క్రితంలో తమిళంలో చేశాము. మళ్లీ ఇంతకాలానికి ఈ సినిమాలో మా కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. ఈ సినిమాలో ఆమె ఆర్య పెయిర్ గా కనిపిస్తుంది.
నేను 2007లో మమత మెహన్ దాస్ ను చూసినప్పుడు ఎలా ఉందో .. ఇప్పటికీ ఆమె అలాగే ఉంది. అప్పటికీ .. ఇప్పటికీ ఆమె లుక్ అలాగే ఉంది. కొంతమంది విషయంలోనే అలా జరుగుతూ ఉంటుంది. ఆమెతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఇక 'టిక్ టాక్' బ్యాన్ చేయవలసిన పరిస్థితిని తీసుకొచ్చిన 'మృణాలిని ఇక్కడ ఉంది. టిక్ టాక్ లో రోజుకో వీడియో చేస్తే ఫరవాలేదు. కానీ నిమిషానికో వీడియో చేసింది. దాంతో చైనా వాళ్లు కంగారుపడిపోయి టిక్ టాక్ ను ఆపేశారు. అలాంటి మృణాళినితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది.
ఇక ఈ వేదికలో ఆర్య అనే ఒకడు ఉన్నాడు. ఇప్పుడు మీరు వదిలితే ఏలూరు వరకూ సైకిల్ మీద వెళ్లిపోతాడు. ఆ సైకిల్ కి ఏదైనా పార్టీ జెండా తగిలిస్తే ప్రచారం చేసినట్టు ఉంటుంది కదా అని నేను అంటూ ఉంటాను. సినిమాల్లో రావడానికి ముందు నుంచే నేను ఆర్య మంచి స్నేహితులం. అప్పుడే నేను చెప్పాను హీరోవి అవుతావు అని. అప్పటి నుంచి ఇప్పటివరకూ మా స్నేహం అలాగే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్య నా ఆస్తి .. వాడిని నేను వదులుకోను. నాకు అన్ని విషయాల్లోను వాడు నాకు స్ఫూర్తి. ఈ సినిమాలో మృణాలితో కంటే ఆర్యతో నా కెమిస్ట్రీ బాగుంటుంది. క్లైమాక్స్ తీసేటప్పుడు ప్రతిరోజు నేను గానీ .. ఆర్యగాని అంబులెన్స్ లో హాస్పిటల్ కి వెళ్లవలసి వచ్చేది. ఈ సినిమా నవంబర్ 4న వస్తుంది. అందరూ థియేటర్లలో చూడండి." అని చెప్పుకొచ్చాడు.