Begin typing your search above and press return to search.
కంగనాను భగత్ సింగ్ తో పోల్చిన యువ హీరో...!
By: Tupaki Desk | 10 Sep 2020 4:00 PM GMTబాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పిలవబడే కంగనా రనౌత్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి చెందినప్పటి నుంచి ఇండస్ట్రీలోని చీకటి కోణాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం - శివసేన కార్యకర్తలను ఢీ కొట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయినా వెనకడుగు వేయకుండా తనకు అనిపించింది సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ వస్తోంది. దీంతో కంగనాకు మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కంగనా కు కార్యాలయాన్ని అక్రమ నిర్మాణమంటూ మహా ప్రభుత్వం కూల్చివేయడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. మహారాష్ట్ర ప్రభుత్వంపై అలాగే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పై ఆమె పోరాటానికి సిద్ధమైంది. కరోనా పరిస్థితుల్లో ఎలాంటి అక్రమ కట్టడమైనా సెప్టెంబర్ 30 వరకు కూల్చకూడదని జీవో ఉన్నప్పుడు ఎలా కూలుస్తారని ఫైర్ అయింది. వీటిపై న్యాయస్థానంలో ఫిర్యాదు చేసి స్టే తెచ్చుకుంది. నీ అహంకారం నేలమట్టం అవుతుందని సీఎంకి వార్నింగ్ ఇచ్చింది. ఈ పోరాటంలో కంగనాకు పలువురు సెలబ్రిటీల నుంచి మద్ధతు లభిస్తోంది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కంగనాకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో విశాల్
విశాల్ తన లేఖలో కంగనా రనౌత్ ను విప్లవ వీరుడు భగత్ సింగ్ తో పోల్చడం విశేషం. "డియర్ కంగనా... మీ ధైర్య సాహసాలకి హ్యాట్సాఫ్. ఏది కరెక్ట్.. ఏది రాంగ్ అనేది మీరు రెండుసార్లు ఆలోచించలేదు. మీ పర్సనల్ ఇష్యూ కానప్పటికీ ఒక ప్రభుత్వ ఆగ్రహాన్ని మీరు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించడానికి ప్రజలు ఎలా స్ట్రాంగ్ గా నిలబడవచ్చో ఉదాహరణగా చూపించారు. 1920లో భగత్ సింగ్ ఎలా అయితే నిలబడ్డాడో అలా మీరు నిలబడ్డారు. సెలబ్రిటీలే కాదు సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చనే సందేశాన్ని సమాజానికి ఇచ్చారు. వాక్ స్వాతంత్రపు హక్కు (ఆర్టికల్ 19). కుడోస్ టూ యూ. నేను మీకు నమస్కరిస్తున్నాను" అని విశాల్ తన లేఖలో పేర్కొన్నారు.