Begin typing your search above and press return to search.
రజినీకి సపోర్ట్ గా కుర్ర హీరో
By: Tupaki Desk | 6 Jan 2018 8:27 AM GMTకోలీవుడ్ లో ప్రస్తుతం రజినీకాంత్ రాజకీయం ప్రస్తావన చాలా హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలంగా పాలిటిక్స్ లోకి వస్తున్నారా లేదా అని ఫ్యాన్స్ ని కొంచెం కన్ఫ్యూజన్ కి గురించి చేసిన తలైవా ఫైనల్ గా ఆరెంజ్ సిగ్నల్ ఇవ్వడంతో అభిమానులు గ్రీన్ సిగ్నల్ రాకముందే హడావుడి చేసేస్తున్నారు. మద్దతు కోసం రజిని వేసిన కొత్త ప్లాన్ చాలా వరకు పనిచేస్తోంది. దీంతో డైరెక్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పార్టీ ప్రణాళికలను తెలియజేయడానికి సిద్దమవుతున్నాడు.
మొత్తంగా తమిళనాడు 234 అసెంబ్లీ స్థానాలను టార్గెట్ చేసిన రజినీకాంత్ అందరి మన్ననలను పొందుతున్నాడు. ఇక సినీ ప్రముఖులులో కూడా రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే చాలా బావుంటుందని తప్పకుండా ప్రజల మంచి కోరుకునే వ్యక్తి ఆయన ఒక్కరే అని మద్దతు పలుకుతున్నారు. ఇకపోతే అందరికంటే ముందుగా హీరోల్లో విశాల్ రజినీ పార్టీకి ఫుల్ సపోర్ట్ ఇస్తానని మాట ఇచ్చేశాడు. ఆయన మంచి చేస్తారు అనే నమ్మకం తనకు ఉందని ఓ వాలంటీర్‌గా ప్రజల్లోకి వెళ్లి, రజినీ తరఫున ప్రచారం చేస్తా అని వివరించాడు. ప్రస్తుతం కోలీవుడ్ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న విశాల్ రీసెంట్ గా ఆర్కే నగర్ ఎన్నికల్లో పోటీ చేద్దామని అనుకున్నాడు. కానీ ఎన్నికల కమిషన్ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించింది. ఇక ప్రస్తుతం రజినీ బాటలో నడవాలని విశాల్ గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.