Begin typing your search above and press return to search.
విశాల్ క్యాంపులో ఇప్పుడు తెలుగమ్మాయ్
By: Tupaki Desk | 5 Nov 2015 7:30 AM GMTకేరళ కుట్టి లక్ష్మి మీనన్ తమిళంలో పాపులర్ హీరోయిన్ గా రాజ్యమేలుతోంది. నల్లనయ్య విశాల్ కి ఫేవరెట్ హీరోయిన్ గా ఇప్పటికే హ్యాట్రిక్ సినిమాల్లో నటించేసింది. విశాల్ సినిమా తీస్తే మొదటి ఆప్షన్ లక్ష్మిమీనన్. తను లేనిదే సినిమా చేయడు అన్నంతగా ఇద్దరూ పాపులర్ అయిపోయారు. అయితే ఈ అమ్మడి హవాకి బ్రేక్ వేసేందుకు తెలుగమ్మాయ్ శ్రీదివ్య పోటీపడుతోంది.
ఇప్పుడు ఓ సినిమాలో లక్ష్మిమీనన్ ని రీప్లేస్ చేసి తంబీలకు షాక్ నిచ్చింది మన శ్రీదివ్య. అతడు-ఆమె మధ్యలో ఈమె ఎవరు? అంటూ ప్రస్తుతం కోలీవుడ్ అంతా కోడై కూస్తోంది. ఈ తెలుగమ్మాయ్ కోలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దూసుకెళుతోంది. వరుత్తపడాద వాలిబర్ సంఘం చిత్రంతో సక్సెస్ బాటలో అడుగుపెట్టిన శ్రీదివ్య కాక్కిసట్టై చిత్రంతో మరో విజయం అందుకుంది. ప్రస్తుతం కార్తీ సరసన కాస్మోరా చిత్రంలో నటిస్తోంది. ఇంతలోనే నల్లనయ్యతో అవకాశం ముంగిటకు వచ్చింది. తాజాగా విశాల్ తో నటించే లక్కీఛాన్స్ ను కొట్టేసింది. కొంబన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు ముత్తయ్య విశాల్ తో తెరకెక్కిస్తున్న సినిమాకి శ్రీదివ్య కథానాయికగా ఎంపికైంది.
అంటే ఇక విశాల్ ఫ్రాంఛైజీలో కొత్త నాయిక చేరినట్టే. శ్రీదివ్యకు కూడా హ్యాట్రిక్ ఛాన్సులిస్తాడేమో చూడాలి. అసలే విశాల్ తెలుగబ్బాయిని అని చెప్పుకుంటాడు కాబట్టి ఇప్పుడు తెలుగమ్మాయిని ఎంకరేజ్ చేయాల్సిన టైమొచ్చింది. ఏం చేస్తాడో చూడాలి.