Begin typing your search above and press return to search.

200 కోట్ల‌తో విశాల్ టాలీవుడ్ డెబ్యూ!

By:  Tupaki Desk   |   18 Feb 2023 9:00 AM GMT
200 కోట్ల‌తో విశాల్ టాలీవుడ్ డెబ్యూ!
X
కోలీవుడ్ హీరోలంతా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే విజ‌య్..ధ‌నుష్‌...శివ కార్తికేయ‌న్.. విజ‌య్ సేతుప‌తి లాంటి వారు ఇప్ప‌టికే లాంచ్ అయ్యారు. కానీ తెలుగు వాడైన విశాల్ మాత్రం ఇంకా టాలీవుడ్ లో అధికారికంగా డెబ్యూ లాంచ్ చేయ‌లేదు. హీరోగా త‌మిళ అనువాద చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తున్నారు త‌ప్ప‌! తెలుగు స్ర్టెయిట్ చిత్రం మాత్రం ఇంత వ‌ర‌కూ చేయ‌లేదు.

ఈ విష‌యంపై నెట్టింట చాలాసార్లు చ‌ర్చ సాగింది గానీ...ఏనాడు విశాల్ వీటిపై స్పందించ‌లేదు. మ‌రి తాజా అప్ డేట్ ఏంటి? అంటే తెలుగు డెబ్యూపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందుతోంది. యాక్ష‌న్ స్టార్ టాలీవుడ్ లో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నే ప్లాన్ చేస్తున్నారుట‌. 2023 మిడ్ లో ఈ ప్రాజెక్ట్ గురించి ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీపై ఇప్ప‌టికే చాలా సినిమాలు నిర్మించారు.

కానీ భారీ బ‌డ్జెట్ చిత్రాల నిర్మాణ‌మైతే జ‌ర‌గ‌లేదు. తొలి ప్ర‌య‌త్నంగా తెలుగు సినిమానే చేస్తే బాగుంటుం ద‌ని ఇంత కాలం వెయిట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప‌నుల్ని విశాల్ స్నేహితులు హైద‌రాబాద్ లో ఉండి చూస్తున్నారుట‌. క‌థ‌..ద‌ర్శ‌కుడకి సంబంధించిన ప‌నుల్లో బిజీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. తెలుగు..త‌మిళ భాష‌ల్లో దీన్ని తెర‌కెక్కించ‌నున్నారు. మ‌రి దీనికి సంబంధించి అధికారిక అప్ డేట్ ఎప్పుడు వ‌స్తుంద‌న్న‌ది చూడాలి.

ప్ర‌స్తుతం విశాల్ ``డిటెక్టివ్-2` లో న‌టిస్తున్నాడు. డిటెక్టివ్ -2ని స్వీయా ద‌ర్శ‌క‌త్వ‌లో తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. ఇప్ప‌టికే దానికి సంబంధిచిన షూటింగ్ ప‌నులు కూడా పూర్త‌య్యాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అలాగే `మార్క్ ఆంటోనీ` అనే మ‌రో సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. విశాల్ గ‌త సినిమా`లాఠీ` భారీ అంచనాల మ‌ధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.