Begin typing your search above and press return to search.
విశాల్ రీల్ హీరోనే కాదు.. రియల్ హీరో
By: Tupaki Desk | 16 May 2019 4:02 PM GMT‘మహర్షి’ సిినిమాలో రైతుల గురించి సమస్యల గురించి చర్చించడం గురించి గొప్పగా చెప్పుకుంటోంది చిత్ర బృందం. ఈ సినిమాలో హీరో తన సంపద నుంచి 9 శాతం రైతుల సంక్షేమానికి ఇచ్చేసి ఉదారత చాటుకుంటాడు. కానీ నిజ జీవితంలో మహేష్ అయినా మరో హీరో అయినా రైతుల కోసం ఏమైనా చేస్తున్నారా అన్నది ప్రశ్నార్థకం. ఐతే ఇలా గుప్త దానాలు చేయకపోయినా.. తమ వంతుగా అంతో ఇంతో రైతుల కోసం సాయం చేసేవాళ్లు కూడా అరుదే. ఐతే తమిళ నటుడు - నిర్మాత విశాల్ మాత్రం రైతుల సంక్షేమం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రశంసలు అందుకుంటున్నాడు.
విశాల్ కొత్త సినిమా ‘అయోగ్య’ గత శనివారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ తెచ్చుకుని చక్కటి వసూళ్లలో సాగిపోతోంది. ఐతే ఈ సినిమాకు అమ్ముడవుతున్న ప్రతి టికెట్ మీదా ఒక రూపాయిని రైతుల సంక్షేమ నిధికి వెళ్లేలా నిర్ణయం తీసుకున్నాడు విశాల్. ఈ సినిమా స్థాయికి ఫుల్ రన్ లో ఓ 20 లక్షల టికెట్లు తెగొచ్చేమో. అంటే రైతులకు రూ.20 లక్షలు వెళ్తాయన్నమాట. ఒక హీరో తన సినిమా రిలీజయ్యే ప్రతిసారీ ఇంత మొత్తం ఇవ్వడం గొప్ప విషయమే. ఈ మంచి పనితో తాను రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా అని విశాల్ చాటి చెప్పాడు. విశాల్ గత సినిమా ‘అభిమన్యుడు’కు కూడా ఇలాగే ప్రతి టికెట్ మీదా రూపాయి తీసి రైతులకు ఇచ్చాడు. ఇకపై తన ప్రతి సినిమాకూ ఇదే సంప్రదాయం కొనసాగించనున్నాడు విశాల్. మిగతా హీరోలు కూడా ఇదే బాటలో నడవాలని కూడా అతను కోరుతున్నాడు. అదే జరిగితే ఇదో గొప్ప పథకంలా మారడం ఖాయం. మరి అందరు హీరోలూ ఆ పనికి ముందుకొస్తారా?