Begin typing your search above and press return to search.
ఆ మూవీ ఇప్పుడు డబ్బింగ్? టూమచ్
By: Tupaki Desk | 11 Feb 2016 3:30 PM GMTఅక్కినేని నాగార్జున ప్రస్తుతం బై లింగువల్ మూవీ చేస్తున్నాడు. కార్తి తో కలిసి నాగ్ చేస్తున్న ఊపిరి.. తమిళంలో తోఝా పేరుతో విడుదల కానుంది. ఈ మూవీతో పాటు నాగార్జున నటించిన పాత సినిమాలను కూడా లైన్ లో పెట్టేస్తున్నారు నిర్మాతలు. ప్రస్తుతం అయితే.. ఓ మూవీ డబ్బింగ్ అయిపోయి వచ్చే నెలలో రిలీజ్ కు రెడీగా ఉంది కూడా.
2008 లో నాగార్జున - విష్ణు కలిసి నటించిన కృష్ణార్జున చిత్రం విడుదలైంది. కమర్షియల్ ఎలిమెంట్స్ బాగానే ఉండే ఈ సినిమాను ఇప్పుడు తమిళ్ లో రౌడీ మాప్పలే పేరుతే విడుదల చేస్తున్నారు. ఈ మూవీనే సెలక్ట్ చేసుకోవడానికి తగిన కారణాలే ఉన్నాయి. కృష్ణార్జునకు డైరెక్టర్ పి.వాసు. ఈయన తమిళ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న దర్శకుడు. అంతే కాదు.. హీరోయిన్ మమతా మోహన్ దాస్ - కేరక్టర్ ఆర్టిస్టులు నాజర్ - నెపోలియన్ - మనోరమలతో పాటు.. స్టార్ కమెడియన్ బ్రహ్మానందంకు కూడా కోలీవుడ్ లో క్రేజ్ బాగానే ఉంటుంది.
మార్చ్ లో పరీక్షల సీజన్ అయినా.. అదే టైంలోనే విడుదల చేస్తారట. ఓ వారం రోజుల పాటు సరైన కలెక్షన్స్ రాబట్టినా.. పెట్టుబడి రిటన్ వచ్చేస్తుందని అంటన్నారు. అది కరెక్టే కానీ.. మరీ ఎనిమిదేళ్ల క్రితం పాత సినిమాని ఇప్పుడు డబ్బింగ్ చేయడమేంటో అర్ధం కాని విషయం. ఒకట్రెండు ఏళ్ల పాత సినిమాలంటే.. పర్లేదు కానీ.. మరీ దాదాపు దశాబ్దం క్రితం సినిమాని ఇప్పుడు డబ్బింగ్ చేస్తాననడంతో.. చాలా మంది నవ్వుకుంటున్నారు.