Begin typing your search above and press return to search.
బాపు - రమణ లేని 'భక్త కన్నప్ప' సాహసమే సుమీ!
By: Tupaki Desk | 26 March 2021 3:30 PM GMT'భక్త కన్నప్ప' అసలు పేరు 'తిన్నడు' .. శివుడి బాధను చూడలేక తన కళ్లను పెరికివేసుకుని ఆయనకి సమర్పించిన మహా భక్తుడు. అలాంటి భక్తుడి కథ 'భక్త కన్నప్ప' పేరుతో చాలాకాలం క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కృష్ణంరాజు .. వాణిశ్రీ .. రావు గోపాలరావు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా అప్పటికీ .. ఇప్పటికీ ఒక ఆణిముత్యమే. కృష్ణంరాజు సొంత బ్యానర్లో నిర్మతమైన ఈ సినిమా, ఆయన కెరియర్లోనే మొదటివరుసలో నిలిచినదిగా చెప్పుకోవాలి. బాపు - రమణల కీర్తి కిరీటంలో ఒక మణిపూసలా నిలిచిన ఈ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు.
అలాంటి 'భక్త కన్నప్ప' కథను తమ బ్యానర్లో తాను హీరోగా నిర్మించే ఆలోచన ఉందని చాలాకాలం క్రితమే మంచు విష్ణు చెప్పాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమయ్యే ఈ సినిమాలో అద్భుతమైన వీఎఫెక్స్ కూడా ఉండనున్నాయనీ, అందువలన ఫారిన్ టీమ్ కూడా పనిచేయనుందని అన్నాడు. అయితే ఆ తరువాత ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని అనుకున్నారు. కానీ మోహన్ బాబు .. విష్ణు మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా ఈ ప్రాజెక్టు ఉందని చెబుతూనే ఉన్నారు. అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతూనే ఉందని అంటున్నారు. తాజాగా కూడా విష్ణు మాట్లాడుతూ .. ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశాడు.
అయితే విష్ణు ఏ వెర్షన్ లో 'భక్త కన్నప్ప' రాసుకున్నా, గతంలో కృష్ణంరాజు హీరోగా వచ్చిన సినిమాతోనే ప్రేక్షకులు పోల్చుకుంటారు. బాపు దర్శక ప్రతిభకు .. ముళ్లపూడి వెంకటరమణ సంభాషణల చాతుర్యానికి ఈ సినిమా నిలువెత్తు నిదర్శనం. ముఖ్యమైన పాత్రలను బాపు తీర్చిదిద్దిన విధానం అద్భుతం. ఇక రావు గోపాలరావు పాత్రకు ముళ్లపూడి వారు రాసిన సంభాషణలు ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేరు "నిన్న రాత్రే కైలాసం వెళ్లివచ్చాను .. అక్కడ శివపార్వతులు .. గణపతి .. కుమారస్వామి కులాసాగానే ఉన్నారు" అంటూ రావు గోపాలరావు చెప్పే డైలాగ్స్ కి జనం హాయిగా నవ్వుకున్నారు.
ఆరుద్ర .. వేటూరి .. సినారె రాసిన పాటలు ఈ కథను మనసు మనసుకు చేరవేశాయి. 'కండగెలిచింది .. ' .. 'ఆకాశం దించాలా ..' .. 'ఎన్నీయాలో ఎన్నీయాలో ..' .. 'శివ శివ శంకర' పాటలు కథా నేపథ్యానికి లోబడి సాగుతాయి. కోయగూడెం నేపథ్యంలో సాగే కథ కావడం వలన జానపద సాహిత్య సౌరభాలు వెదజల్లబడతాయి. ఇక రామకృష్ణ .. సుశీల .. బాలు .. జానకి స్వరాలు ఈ కథపై తేనెలు చల్లిన అనుభూతిని కలిగిస్తాయి. అలాంటి మహామహులు పనిచేసిన 'భక్త కన్నప్ప'ను మరోసారి టచ్ చేయడానికి మంచు విష్ణు ప్రయత్నించడం సాహసమే అవుతుంది. ఇందులో విజయం సాధిస్తే కచ్చితంగా అది ఒక రికార్డుగానే నిలుస్తుంది.