Begin typing your search above and press return to search.
నాకున్నది గర్వం కాదు .. మొహమాటం: హీరో విష్ణు
By: Tupaki Desk | 15 March 2021 7:30 AM GMTమంచు విష్ణు ఇటు హీరోగానూ .. అటు నిర్మాతగాను విభిన్నమైన సినిమాలను చేస్తూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'మోసగాళ్లు' రూపొందింది. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో విష్ణు బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నా పాత్ర నెగెటివ్ షేడ్స్ తో కనిపిస్తుంది. ఈ తరహా పాత్రను నేను పోషించడం ఇదే ఫస్టు టైమ్. అంతేకాదు నాకున్న మార్కెట్ కి మించి ఖర్చు చేసిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాలో నాకు అక్కయ్య పాత్రలో కాజల్ నటిస్తుంది.
ఇంతకుముందు నా సినిమాల విడుదల సమయంలో నేను ఎక్కువగా బయటికి వచ్చింది లేదు .. ప్రమోషన్స్ కోసం పెద్దగా సమయాన్ని కేటాయించింది లేదు. దాంతో చాలామంది నాకు గర్వం ఎక్కువ అనుకున్నారు. కానీ నిజానికి నాకు జనంలోకి వెళ్లాలంటే చాలా టెన్షన్ గా ఉంటుంది .. మీడియాతో మాట్లాడాలన్నా అదే పరిస్థితి. మొహమాటం కూడా చాలా ఎక్కువ. అందువల్లనే నేను బయట ఎక్కడా కనిపించేవాడిని కాదు. గతంలో జరిగిన పొరపాటు మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ సినిమాతో మీ ముందుకు వచ్చాను. అంతేకాదు ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తది అనే విషయం చెప్పాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది.
ముందుగా ఈ సినిమాను హాలీవుడ్ లో మాత్రమే చేద్దామని అనుకున్నాం. ఆ తరువాత పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాము. టెక్నాలజీని ఉపయోగించుకుని చేసే మోసం నేపథ్యంలో కథ నడుస్తుందని చెప్పాను. దాంతో ఈ కథ అంతా కూడా కంప్యూటర్ల చుట్టూ తిరుగుతుందనీ, సామాన్య ప్రేక్షకులకు అర్థమవుతుందో లేదో అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ కథ అన్ని వర్గాల ప్రేక్షకులకు చాలా తేలికగా అర్థమవుతుంది. అలాగే మొత్తం కంప్యూటర్ల హడావిడి ఉండదు. అంతా ఆశించే వినోదం పుష్కలంగా ఉంటుంది" అంటూ విష్ణు క్లారిటీ ఇచ్చాడు.