Begin typing your search above and press return to search.

మంచు నాగేశ్వరరావుకు జోడీగా ఆర్డీఎక్స్ బాంబ్‌

By:  Tupaki Desk   |   6 March 2022 3:30 PM GMT
మంచు నాగేశ్వరరావుకు జోడీగా ఆర్డీఎక్స్ బాంబ్‌
X
మంచు హీరో విష్ణు ఇటీవలే ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఒక సినిమాను ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా కు సంబంధించిన హీరో పాత్రను తాజాగా మంచు విష్ణు చాలా విభిన్నంగా రివీల్‌ చేశాడు. గాలి నాగేశ్వరరావు అనే మాస్ పాత్రలో మంచు విష్ణు కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. చాలా మాస్ గా ఆ పాత్ర ఉంటుందని తాజాగా ఒక కార్టూన్ ను విడుదల చేసి తెలియజేశారు.

ఈమద్య కాలంలో మంచు విష్ణు నటించిన ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని దక్కించుకోలేక పోయింది. దాంతో ఈ సినిమా పై మంచు విష్ణు చాలా నమ్మకంతో కనిపిస్తున్నాడు. విభిన్నమైన కథతో దర్శకుడు ఇషాన్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా ఆయన ఒక సందర్బంగా చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు మంచు విష్ణు ను చూడని విధంగా ఈ సినిమాల చూస్తామని అంటున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన కీలక ప్రకటన అతి త్వరలో రాబోతుంది. ఇదే సమయంలో సినిమా లో మంచు విష్ణు కు జోడీగా ఆర్‌ఎక్స్ 100 మరియు ఆర్డీఎక్స్ లవ్ ఫేమ్‌ పాయల్‌ రాజ్ పూత్‌ ను ఎంపిక చేయడం జరిగింది. మంచు విష్ణు కు జోడీగా పలువురు హీరోయిన్స్‌ ను పరిశీలించిన తర్వాత చివరకు ఈ అమ్మడిని ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పాయల్‌ కూడా చాలా మాస్ పాత్రలో ఈ సినిమా లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

మంచు విష్ణు కు ఈ సినిమా లైఫ్ అండ్‌ డెత్‌ అన్నట్లుగా మారింది. కేవలం మంచు విష్ణు కు మాత్రమే కాకుండా ఆయన ఫ్యామిలీ కి కూడా ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా మారింది. ఇటీవల మోహన్‌ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా విడుదల అయ్యి నిరాశ పర్చింది. ఆ సినిమా మరీ అవమానకరమైన ఫలితాన్ని చవి చూడటం తో మంచు ఫ్యామిలీకి డ్యామేజీ కంట్రోల్‌ కావాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ సమయంలో మంచు విష్ణు నుండి రాబోతున్న సినిమా కాస్త అయినా ఊరట ఇవ్వాలని అభిమానులు ఆశ పడుతున్నారు. ఎన్నో గొప్ప సినిమాలు చేసిన మోహన్‌ బాబు సన్నాఫ్ ఇండియాతో నిరాశ పర్చిన తీరు ను అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే మంచు విష్ణు స్పీడ్‌ గా మరో సినిమాను తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడనే టాక్‌ వినిపిస్తుంది. మంచు విష్ణు నటించబోతున్న ఈ సినిమా టైటిల్‌ ను అతి త్వరలోనే రివీల్‌ చేసే అవకాశం ఉందన్నారు.