Begin typing your search above and press return to search.

దున్న‌పోతుతో పోల్చుకుని అడ్డంగా బుక్క‌య్యాడు!

By:  Tupaki Desk   |   17 Sep 2022 8:44 AM GMT
దున్న‌పోతుతో పోల్చుకుని అడ్డంగా బుక్క‌య్యాడు!
X
సోష‌ల్ మీడియా వేదిక‌గా సినీ స్టార్స్, సెల‌బ్రిటీస్ ఏ చిన్న ట్వీట్, పోస్ట్ పెట్టాల‌న్నా ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచిస్తుంటారు. ఏ ట్వీట్ చేస్తే ఎక్క‌డ బుక్క‌యిపోతామోన‌ని ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అయితే కొంత మంది మాత్రం కావాల‌ని, నెటిజన్ ల‌కు అడ్డంగా బుక్క‌వ్వాల‌నే ట్వీట్ లు చేస్తూ అడ్డంగా దొరికిపోతుంటారు. ఈ మ‌ధ్య అన‌సూయ‌, హీరో, మా అధ్య‌క్షుడు మంచు విష్ణు సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్ ల‌కు అడ్డంగా దొరికిపోతూ ట్రోలింగ్ కి గుర‌వుతున్న విష‌యం తెలిసిందే.

మా ఎన్నిక‌ల ద‌గ్గ‌రి నుంచి నెట్టింట మంచు విష్ణు ఏం షేర్ చేసినా నెటిజ‌న్ లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తూ ఆడేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రోసారి అడ్డంగా నెట్టింట బుక్క‌య్యాడు మంచు విష్ణు. దున్న‌పోతు ఫొటోని శ‌నివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేసిన మంచు విష్ణు దానికి క్యాప్ష‌న్ ఇచ్చాడు. `ప‌ది పుష్ అప్ లు చేసిన త‌రువాత నేనూ కూడా ఇలాగే వుంటాన‌ని ఊహించుకుంటున్నాను` అంటూ ట్వీట్ చేశాడు.

మంచు విష్ణు షేర్ చేసిన ఫొటోలోని దున్న‌పోతు బ‌లిష్టంగా, దృడ‌మైన శ‌రీరాకృతిలో వుండ‌టంతో నెటిజ‌న్ లు రంగంలోకి దిగారు. ఏదైతే అన‌కూడ‌దో అదే మంచు విష్ణు నోటి నుంచి రావ‌డంతో ట్రోలింగ్ చేయిడం మొద‌లు పెట్టారు.

ఇటీవ‌లే ఓ వెరైటీ ఫొటోని షేర్ చేసి ట్రోల్ కి గురైన మంచు విష్ణు మ‌ళ్లీ అదే త‌ప్పు చేయ‌డంతో నెటిజ‌న్ లు ఓ రేంజ్ లో ఆడుకోవ‌డం మొద‌లు పెట్టారు. పుష‌ప్స్ చేయ‌మ‌క‌ముందు కూడా దున్న‌పోతు దున్న‌పోతే అంటూ ఘాటుగా కౌంట‌ర్లు ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు.

దీంతో మంచు విష్ణు షేర్ చేసిన దున్న‌పోతు ఫొటో, ట్వీట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇదిలా వుంటే మంచు `జిన్నా` సినిమాతో మంచు విష్ణు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. స‌న్నీ లియోన్‌, పాయ‌ల్ రాజ్ పుత్ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. సూర్య ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈమూవీకి కోన వెంక‌ట్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.