Begin typing your search above and press return to search.

వాళ్లకోసం కన్నీళ్లు పెట్టుకున్న మంచు విష్ణు..

By:  Tupaki Desk   |   1 April 2020 7:50 AM GMT
వాళ్లకోసం కన్నీళ్లు పెట్టుకున్న మంచు విష్ణు..
X
కరోనా భయంతో యావత్ ప్రపంచ దేశాలు గడగడ వణికిపోతున్నాయి. రోజురోజుకి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో జనాలలో భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే అమెరికా వంటి దేశాలలో విస్తృతం గా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి ఇతర దేశాలను సైతం కంగారు పెట్టిస్తుంది. ఇంతవరకు వాక్సిన్ లేని ఈ కరోనా ఎప్పుడు ఎవరినీ చంపేస్తుందోనని జనాలు అల్లాడిపోతున్నారు. ఇండియాలో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 21రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ విధించినా కూడా ఇండియాలో కరోనా కేసులు 1200 దాటిపోయాయి. రోజురోజుకి మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. దీని పై హీరో మంచు విష్ణు ఈ రోజు సోషల్ మీడియాలో స్పందిస్తూ తన భార్య పిల్లల గురించి కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఫిబ్రవరి నెలలో బంధువుకి సర్జరీ ఉందంటే అమెరికా వెళ్లామని అయితే నాన్న పుట్టిన రోజు ఏర్పాట్ల కోసం నేను వెంటనే ఇండియాకి వచ్చేసినట్లు తెలిపాడు. ఇంతలో అమెరికా నుండి నా భార్య పిల్లలు బయలుదేరే టైంకి ఇండియాలో కరోనా జోరు పెరగడం తో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈ దెబ్బతో విమాన సర్వీసెస్ నిలిచి పోయాయి. నా భార్య విరానికా, పిల్లలు అరియనా, వివియానా, అవ్రామ్, ఐరాలు అక్కడే ఉండి పోయారు అని తెలిపారు. నా భార్య పిల్లలంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళతో నేను ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయాను. అందుకే వాళ్ళిక్కడ లేకపోతే తట్టుకోలేక పోతున్నాను అంటూ ఎమోషనల్ అయిపోయాడు. వాళ్ళతో అంత ఎమోషనల్ కనెక్ట్ అవ్వడమే తన బ్యాడ్ హ్యాబిట్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.