Begin typing your search above and press return to search.
విక్టరీ ముందే తెలిసే ప్రకాష్ రాజ్ తో సెల్ఫీ దిగాడా?
By: Tupaki Desk | 11 Oct 2021 4:30 AM GMT`మా` ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలను సంధించుకోవడం.. వ్యక్తిగత దూషణలకు దిగడం వంటి సంఘటనలతో `మా` ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో `మా` ఎన్నికల వ్యవహారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణ ఎన్నికల తరహాలో అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం జరగడంతో ఎన్నికల తేదీ దగ్గర పడేకొద్దీ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
పోలింగ్.. ఎన్నికల ఫలితాల్లోనూ అదే ఉత్కంఠ కనిపించింది. ఫలితాల సమయంలోనూ ఇరు వర్గాల మధ్య నువ్వా.. నేనా అన్నట్టుగా సాగింది. అయితే ఈ ఉత్కంఠ పోరులో మా అధ్యక్ష పదవికి పొటీ చేసిన హీరో మంచు విష్ణు విక్టరీని సాధించారు. ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ పై 101 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మంచు విష్ణుకు 385 ఓట్లు రాగా... ప్రకాష్ రాజ్ కు 274 ఓట్లు పోలయ్యాయి. ఇదిలా వుంటే ప్రకాష్ రాజ్ అధ్యక్షుడిగా ఓటమిపాలైనా అతని ప్యానెల్ నుంచి పలువురు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు.
అయితే ఈ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించడం చాలా మందికి ఆర్చర్యాన్ని కలిగించింది. మెగాస్టార్ చిరంజీవి మద్దతుగా నిలిచిన ప్యానెల్ గత కొంత కాలంగా విజయం సాధిస్తూ వస్తోంది. ఆ ఆనవాయితీ ప్రకారం ఈ దఫా కూడా చిరంజీవి మద్దతుగా నిలిచిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ విజయం సాధిస్తుందని అంతా భావించారు కానీ అనూహ్యంగా మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందడం గమనార్హం. అయితే ఈ విషయంలో ముందు నుంచి మంచు విష్ణు చాలా కాన్ఫిడెన్స్ తో కనిపించాడు. అందుకే ప్రకాష్ రాజ్ తో ముందే సెల్ఫీ తీసుకున్నాడు.
అంతా తననే సమర్ధిస్తారని.. తననే గెలిపిస్తారని బలంగా చెబుతూ వచ్చాడు. ఫలితాల్లో అదే కనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే విష్ణు మాయ ఫలించిందా? అన్నట్టుగా ఫలితం కనిపించింది. ఇంతకీ మంచు విష్ణు ఏం మాయ చేశాడు? .. మోహన్ బాబు చక్రం తిప్పడం వల్లే విష్ణు గెలిచాడన్నది స్పష్టంగా కనిపిస్తోంది. మోహన్ బాబు మంత్రాంగంతో పాటు ప్రకాష్‌రాజ్ నాన్ లోకల్.. అతనిపై గతంలో వున్న వివాదాలు కూడా మంచు విష్ణుకు కలిసి రావడం.. తెలుగు నటుల సంఘానికి పర భాష నటుడు అధ్యక్షుడు కావడం ఏంటనే వాదన ముందుకు రావడం.. ఇలా కర్ణుడి చావుకు సవా లక్షా కారణాలు అన్నట్టుగా ప్రకాష్ రాజ్ ఓటమికి చాలా కారణాలు ప్రతికూలంగా నిలిచి అవి మంచు విష్ణుకు వరంగా మారి అతన్ని ఊహించని స్థాయిలో `మా` అధ్యక్ష పీఠంపై నిలబెట్టాయి. ఇక కౌంటింగ్ దశలో మంచు విష్ణు ప్యానెల్ ఆరంభం నుంచి దూకుడుగా కనిపించింది. ఒక దశలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు గెలిచి అతడిలో ఉత్సాహం పెంచినా ఎందుకనో ఆయన ముఖంలో ఏదో సందేహం కనిపించింది. కౌంటింగ్ స్థలంలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నప్పుడు విష్ణు ఎంతో జోష్ తో కనిపిస్తే ప్రకాష్ రాజ్ చాలా స్ట్రెయిన్ అయినట్టు కనిపించారు. తన ఓటమిని మంచు విష్ణు గెలుపును ప్రకాష్ రాజ్ ముందే గ్రహించాడా? అంటూ అంతా గుసగుసలు వినిపించాయి. చివరికి అనుకున్నంతా అయ్యింది.