Begin typing your search above and press return to search.

విష్ణు వ‌ర్ధ‌న్ ఇందూరి.. ఓ మాస్ట‌ర్ మైండ్‌

By:  Tupaki Desk   |   25 Dec 2021 3:30 AM GMT
విష్ణు వ‌ర్ధ‌న్ ఇందూరి.. ఓ మాస్ట‌ర్ మైండ్‌
X
అసాధ్యాల‌ని సుసాధ్యాలుగా మ‌లిచే వారినే మాస్ట‌ర్ మైండ్స్ అంటుంటారు. ఈ విష‌యంలో ముందు వ‌రుస‌లో వున్న వ్య‌క్తి విష్ణు వ‌ర్ధ‌న్ ఇందూరి.. గ‌త కొన్నేళ్లుగా ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న పేరిది. సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) తో ఒక్క‌సారిగా వార్త‌ల్లోకి వ‌చ్చారు. ముందు టాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో మొద‌లైన ఈ క్రికెట్ లీగ్ ని ఇత‌ర భాష‌ల తార‌ల‌ని ఏకం చేయ‌డంతో టాక్ ఆఫ్ ది ఇండియాగా నిలిచాడు. దీంతో సీసీఎల్ వేదిక ద్వారా విష్ణు వ‌ర్ధ‌న్ ఇందూరికి దేశ వ్యాప్తంగా వున్న అన్ని భాష‌ల‌కు చెందిన ఫిల్మ్ స్టార్‌ల‌తో పాటు క్రికెట‌ర్ల‌తోనూ ప‌రిచ‌యాలు ఏర్ప‌డ్డాయి.

స‌ల్మాన్ ఖాన్‌, ర‌ణ్ వీర్ సింగ్ , సోహైల్ ఖాన్‌, సొనాక్షి సిన్హా, కంగ‌న ర‌నౌత్‌, సూర్య‌, మోహ‌న్ లాల్‌, జెనీలియా బోనీ క‌పూర్‌, దివంగ‌త న‌టి శ్రీ‌దేవి ల‌తో మంచి ప‌రిచ‌యాలు ఏర్ప‌ర‌చుకున్నారు, సైమా సంబ‌రాల‌ని కూడా సౌత్ కి ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త విష్ణు వ‌ర్ధ‌న్ ఇందుకూరిదే. సీసీఎల్ ద్వారా భార‌తీయ సినీ స్టార్ల‌ని ఏకంచేసిన విష్ణు వ‌ర్ధ‌న్ వ‌రుస‌గా సీసీఎల్ ల‌ని నిర్వ‌హించి టాప్ సెల‌బ్రిటీల‌కు మరింత చేరువ‌య్యారు. ఇదే అద‌నుగా ఆయ‌న ఎవ‌రూ ఊహించ‌ని, ట‌చ్ చేయ‌డానికి కూడా సాహ‌సించ‌ని బ‌యోపిక్ ల‌కు శ్రీ‌కారం చుట్టారు.

ఈ ప్రాసెస్ లో ముందుగా తెర‌పైకి వ‌చ్చిన బ‌యోపిక్ `ఎన్టీఆర్‌`. నంద‌మూరి బాల‌కృష్ణ‌ని ఎన్టీఆర్‌గా చూపిస్తూ రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. `ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు`, ఎన్టీఆర్ మ‌హా నాయ‌కుడు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బ‌స‌వ తార‌కంగా విద్యాబాల‌న్ న‌టించిన విష‌యం తెలిసిందే. అయితే భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ రెండు భాగాలు ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయాయి. దీంతో ఫ‌స్ట్ బ‌యోపిక్ విఫ‌లం కావ‌డంతో త‌ను ఎక్క‌డ త‌ప్పు చేశాడో తెలుసుకున్నాడు విష్ణ వ‌ర్ధ‌న్‌. ఆ త‌రువాత ఆయ‌న చేసిన మ‌రో బ‌యోపిక్ `త‌లైవి`.

త‌మిళ రాజ‌కీయ ముఖ‌చిత్రంపై జ‌య‌ల‌లిత‌ది చెర‌గ‌ని ముద్ర‌. ఆమె సినీ, రాజ‌కీయ అంశాల నేప‌థ్యంలో `త‌లైవి`ని కంగ‌న‌తో రూపొందించారు. కోవిడ్ ఈ సినిమాని దారుణంగా దెబ్బ‌తీసింది. పైగా మేకింగ్ ప‌రంగా కూడా విమ‌ర్శ‌లు వినిపించాయి. ఈ రెండు బ‌యోపిక్‌ల త‌రువాత విష్ణు వ‌ర్ధ‌న్ బాలీవుడ్ నిర్మాత‌లతో క‌ల‌సి చేసిన చిత్రం `83`. వ‌ర‌ల్డ్ క్రికెట్ భార‌తీయ క్రికెటర్లు సాధించిన అద్భుత విజ‌యం నేప‌థ్యంలో ఈ సినిమాని తెర‌కెక్కించారు. ఈ 24న ఈ చిత్రం విడుద‌లై మంచి టాక్ ని సొంతం చేసుకుంది.

ఇదిలా వుంటే ఈ సినిమా త‌రువాత మ‌రో మ‌హ‌త్త‌ర‌మైన‌క‌థ‌కు శ్రీ‌కారం చుట్టాడు విష్ణు ఇందూరి. చ‌రిత్ర మ‌రుగున ప‌డేసిన కొంత మంది హీరోల జీవిత క‌థ ఆధారంగా `ఆజాద్ హింద్` పేరుతో ఓ సిరీస్ చిత్రాల‌ని నిర్మించ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ప్ర‌క‌ట‌న‌ని ఇటీవ‌ల చేశారు కూడా. భ‌గ‌త్ సింగ్ ని ఉరి శిక్ష నుంచి కాపాడ‌టం కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసిన ఓ వీర‌నారి చ‌రిత్ర చూడ‌ని క‌థ‌ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు.

`ఆజాద్ హింద్` లో భాగంగా రానున్న ఈ చిత్రాన్ని `వీరాంగ‌న దుర్గావ‌తిదేవి` పేరుతో రూపొందించ‌బోతున్నారు. విష్ణు వ‌ర్ధ‌న్ ఇందుకూరి ప్లానింగ్ ,, సినిమాల లైన‌ప్ చూసిన వారంతా విష్ణు వ‌ర్ధ‌న్ ఇందూరి.. ఓ మాస్ట‌ర్ మైండ్ అంటున్నారు. నిజ‌మే అసాధ్య‌మైన క‌థ‌లకు రూప‌క‌ల్ప‌న చేస్తూ అంద‌రిని స‌ర్‌ప్రైజ్ చేస్తున్నారు. అయితే అవి అన్ని వ‌ర్గాల వారికి చేరువ అయితేనే అత‌ని ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంది క‌దా అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.