Begin typing your search above and press return to search.
రవితేజ సమర్పణలో విష్ణు విశాల్ FIR
By: Tupaki Desk | 31 Jan 2022 5:30 PM GMTకోలీవుడ్ లో అత్యంత ప్రతిభావంతుడైన.. విజయవంతమైన హీరోగా విష్ణు విశాల్ కి పేరుంది. దర్శకుడు మను ఆనంద్ తో కలిసి విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై స్వయంగా నిర్మించిన FIR అనే డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం తమిళం- తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఎఫ్.ఐ.ఆర్ కు తెలుగులో పెద్ద అండ లభించింది. మాస్ మహారాజా రవితేజ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో అభిషేక్ పిక్చర్స్ విడుదల చేస్తోంది. ఫిబ్రవరి 11న ఎఫ్.ఐ.ఆర్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి.
విష్ణు విశాల్ నటించిన వెన్నెల కబడ్డీ కుజు (భీమిలి కబడ్డీ జట్టు) మరియు.. రత్సాసన్ (రాక్షసుడు) వంటి కొన్ని సూపర్ హిట్ చిత్రాలు తెలుగులోకి రీమేక్ అయ్యి విజయం సాధించాయి. రానా నటించిన అరణ్యలో విష్ణు విశాల్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. ఇప్పుడు FIR అతని మొదటి సోలో హీరో చిత్రం. తెలుగు-తమిళంలో ఘనంగా విడుదలవుతోంది.
ఎఫ్.ఐ.ఆర్ ఒక సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఇర్ఫాన్ అహ్మద్ అనే అమాయక యువకుడి జీవితంలోని మలుపుల కథ. భయంకరమైన ISIS ఉగ్రవాది అబూ బక్కర్ అబ్దుల్లా పరిశోధన ఆధారంగా కథను రెడీ చేశారు. చెన్నై- కొచ్చి- కోయంబత్తూర్- హైదరాబాద్ లో కథ సాగుతుంది. అతని జీవితాన్ని అతని చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ హెచ్చరించే వివరించలేని పరిస్థితులలో చిక్కుకున్న ఇర్ఫాన్ కథను తెరపై చూడాల్సిందే. ఈ చిత్రం లో చిద్రమైన ఇర్ఫాన్ అనే యువకుడి జీవితాన్ని చూడొచ్చు. అతడి జీవితంలో సంఘటనల సమాహారాన్ని తెరపై చూడొచ్చు. అతనిని చెడ్డవాడిగా చిత్రీకరించే మీడియా కూడా కనిపిస్తుంది. తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సాధారణ జీవితానికి ఆస్కారం ఉందా.. తిరిగి వెనక్కి రాగలడా? లేదా ఇర్ఫాన్ జీవితంలో కంటికి కనిపించే దానికంటే ఎక్కువ తెలుసుకోవాల్సినది ఉందా? ఇలా.. అన్ని కోణాల్లో కథాంశం చాలా విలక్షణంగా అనిపిస్తుంది.
ఈ సినిమా కోసం ఎంపిక చేసిన కథపై ఎంతో వర్క్ చేశారు. ఒక మనిషి జీవితంపై పరిశోధనాత్మక చిత్రమిది. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో మాంజిమా మోహన్ -రైజా విల్సన్ - రెబా మోనికా జాన్- మాలా పార్వతి తదితరులు నటిస్తున్నారు. సాంకేతిక బృందం విషయానికి వస్తే... అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీని నిర్వహించగా.. అశ్వత్ సౌండ్ ట్రాక్ ను అందించారు.
మను ఆనంద్ ఈ చిత్రానికి దర్శకరచయిత. మాస్ మహారాజా రవితేజ సమర్పించారు. అరుల్ విన్సెంట్ ఛాయాగ్రాహకుడు కాగా.. అశ్వత్ సంగీతం అందించారు. సీతారాం శ్రవంతి- సాయినాథ్ దినేష్ కర్ణన్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మించింది.