Begin typing your search above and press return to search.
చేతులెత్తేసి కొట్టుకోమన్నారు
By: Tupaki Desk | 8 Dec 2018 7:35 AM GMTఒకే రోజు నాలుగైదు సినిమాలు విడుదల కావడం టాలీవుడ్ లో కొత్తేమి కాదు. విపరీతమైన క్లాష్ ఏర్పడినప్పుడు దాన్ని నియంత్రించే విధంగా మన దగ్గర ఎలాంటి వ్యవస్థ లేదు. నిర్మాతల సమాఖ్య ఈ దిశ గా చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. కాని కోలీవుడ్ లో పరిస్థితి మనకు భిన్నంగా ఉంటుంది. విశాల్ తీసుకొచ్చిన సంస్కరణల్లో భాగంగా ఏదైనా విడుదల తేది డిసైడ్ కావాలి అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి. అక్కడ లేఖ తీసుకున్నాకే డేట్ అనౌన్స్ చేయాలి. ఇది ఇప్పటి దాకా బాగా నే ఫాలో అవుతూ వచ్చారు అందరు. అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురైనా ఏదోలా సర్దుకుంటూ నెట్టుకుంటూ వచ్చారు.
కాని ఈ సారి రెండు సందర్భాల్లో తామేమి చేయలేమంటూ తమిళ నిర్మాతల సమాఖ్య చేతులు ఎత్తేసింది. డిసెంబర్ 21న ఏకంగా ఆరు సినిమాలు అక్కడ పోటీ పడుతున్నాయి. ధనుష్-విజయ్ సేతుపతి-జయం రవి-విష్ణు విశాల్-యష్-శివ కార్తికేయన్ మొండి గా తమ సినిమాలను క్యులో పెట్టారు. వీటి కి ధియేటర్ల కేటాయింపు పెద్ద తలనెప్పిగా మారింది. అయితే రాజీ చేద్దాం అనుకున్న సమాఖ్య ప్రయత్నాలు నెరవేరలేదు. అంతే కాదు జనవరి 10 లేదా 11 ఒకే సమయాన్ని టార్గెట్ చేసిన రజని పెట్టా అజిత్ విశ్వాసంల లో ఒక దాన్ని డేట్ మార్పించే చర్చలు కూడా ఫెయిల్ అయ్యాయి.
తాము అనుకున్న డేట్ కే విడుదల చేయాలి అని భీష్మించుకు కూర్చోవడంతో నిన్న ఈ రెండు తేదీలతో తమ ప్రమేయం ఉండదని ప్రకటించేసింది. ఇప్పటికీ దీని మీద విష్ణు విశాల్ ఫైర్ అయ్యారు. తప్పుకుని కొట్టుకోమని చెప్పడానికి అయితే ఇంక మీరెందుకని ట్విట్టర్ లో నిలదీశాడు. ఇదంతా ఓకే కాని చెన్నై లాంటి నగరాల్లో తెలుగు సినిమాలు సైతం మంచి విడుదల దక్కించుకుంటాయి. మరి పడి పడి లేచే మనసు-అంతరిక్షంలు 21న అక్కడ విడుదల కావడం కష్టంగానే ఉంది