Begin typing your search above and press return to search.

2021లో యువ‌హీరోతో గుత్తా జ్వాల పెళ్లి

By:  Tupaki Desk   |   15 Dec 2020 2:30 AM GMT
2021లో యువ‌హీరోతో గుత్తా జ్వాల పెళ్లి
X
2020 సెల‌బ్రిటీ వెడ్డింగ్ సీజ‌న్ అనే చెప్పాలి. ప‌లువురు టాలీవుడ్ హీరోలు పెళ్లి చేసుకుని ఓ ఇంటివాళ్ల‌య్యారు. వీళ్ల‌లో చాలామంది ప్రేమ వివాహాలు చేసుకోగా కొంద‌రు పెద్ద‌లు కుదిర్చిన పెళ్లికి ఓకే చెప్పారు. మరికొందరు రెండో వివాహం చేసుకున్నారు.

ఈ సీజ‌న్ లోనే మ‌రో సెల‌బ్రిటీ వెడ్డింగ్ గురించిన గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాలా 2021 లో త‌మిళ యువ‌హీరో విష్ణు విశాల్ ను వివాహం చేసుకోనున్నారు. ఇది జ్వాలా గుత్తాకు.. అలాగే విష్ణు విశాల్ కు కూడా రెండో వివాహం. తమిళ నటుడు విష్ణు విశాల్ తో ఆమె ప్రేమాయ‌ణంపై ఇప్ప‌టికే మీడియాలో క‌థ‌నాలెన్నో వ‌చ్చాయి.

ఇప్పటికే ఈ జంట‌ నిశ్చితార్థం అయ్యింది. 2021 ప్రారంభంలో పెళ్లి ముహూర్తం కోసం వెతుకుతున్నార‌న్న‌ది తాజా గుస‌గుస‌. ఇప్ప‌టికే విష్ణు విశాల్ కూడా విడాకులు తీసుకున్నారు. జ్వాలాను పెళ్లాడేందుకు ఏర్పాట్ల‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఈ పెళ్లి గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.